Virat Kohli: రాత మార్చేందుకు పాత రూటులోకి.. కోహ్లీ ఊహించని ట్విస్ట్
ABN , Publish Date - Jan 25 , 2025 | 06:15 PM
Team India: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత కొన్నాళ్లుగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. వరుస వైఫల్యాలతో అన్ని వైపుల నుంచి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు.

భారత టెస్ట్ టీమ్ పెర్ఫార్మెన్స్ రోజురోజుకీ పడిపోతోంది. విదేశాలతో పాటు స్వదేశంలోనూ ఈ మధ్య కాలంలో టీమిండియాకు ఊహించని ఓటములు ఎదురయ్యాయి. న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్, ఆస్ట్రేలియా టూర్‌లో దారుణ ఓటములు జట్టు పరువు తీశాయి. అయితే దీనికి మేజర్ రీజన్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వైఫల్యం జట్టుకు తీవ్ర నష్టం కలిగించింది. దీంతో ఫామ్ అందుకునేందకు ఇద్దరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హిట్‌మ్యాన్ రంజీలను ఆశ్రయించగా.. విరాట్ పాతబాట పట్టాడు.
ఫుల్ ఫోకస్!
టీమ్ రాత మార్చేందుకు, అలాగే తన రాత మార్చుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు కోహ్లీ. అందుకోసం పాత కోచ్ సాయం తీసుకుంటున్నాడు. అతడి పర్యవేక్షణలో ముంబైలోని ఓ గ్రౌండ్‌లో నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు. బ్యాటింగ్ టెక్నిక్ మెరుగుపర్చుకోవడం, ఫుట్‌వర్క్ లోపాలు సరిదిద్దుకోవడం, బంతిపై ఫోకస్ పెంచడం, తిరిగి కాన్ఫిడెన్స్ అందుకోవడం మీద పని చేస్తున్నాడు. కోహ్లీ బ్యాటింగ్ లోపాలు దగ్గరుండి సరిదిద్దుతున్న ఆ వ్యక్తి మరెవరో కాదు.. భారత మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్. ఆయనతో కలసి నెట్ సెషన్స్‌లో తీవ్రంగా బ్యాటింగ్ సాధన చేస్తూ కనిపించాడు కింగ్. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
రాత మారేనా?
సంజయ్ బంగర్ బంతులు వేయడం కోహ్లీ డిఫెన్స్ చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. నెక్స్ట్ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్, ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ ఉండటంతో తప్పక ఫామ్ అందుకోవాల్సిన పరిస్థితి. అందుకే బంగర్‌ను ప్రత్యేకంగా పిలిపించుకొని మరీ తన తప్పులను సరిదిద్దుకునే పనిలో పడ్డాడు కోహ్లీ. ఇంగ్లండ్ సీమర్లు జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ భీకర పేస్‌తో బౌన్సర్లు వేస్తారు కాబట్టి ప్రాక్టీస్‌లో ఆ తరహా బంతులతో బ్యాటింగ్ సాధన చేశాడు కోహ్లీ. ఇది చూసిన నెటిజన్స్.. పాత కోచ్ విరాట్ రాత మారుస్తాడని, ఇక కింగ్‌కు తిరుగులేదని అంటున్నారు. అయితే ఓల్డ్ కోచ్‌తో ప్రాక్టీస్ చేస్తూ కోహ్లీ ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయిందని అంటున్నారు. కాగా, 2014 నుంచి 2019 వరకు టీమిండియాకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు బంగర్. అలాగే 2021 నుంచి 2023 వరకు ఆర్సీబీకి కోచ్‌గా సేవలు అందించాడు.
ఇవీ చదవండి:
క్రికెట్ చరిత్రలో సంచలనం.. 73 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
ఐసీసీ టీ20 టీమ్.. భారత్ నుంచి నలుగురు స్టార్లు
రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి