Share News

IPL 2025 Kolkata Weather Update: వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఎవరికి నష్టం.. కోహ్లీ టీమ్ సేఫేనా..

ABN , Publish Date - Mar 22 , 2025 | 03:00 PM

KKR vs RCB Weather Forecast: ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే వరుణుడు అందర్నీ భయపెడుతున్నాడు. ఈ మ్యాచ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఏం అవుతుందో ఇప్పుడు చూద్దాం..

IPL 2025 Kolkata Weather Update: వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఎవరికి నష్టం.. కోహ్లీ టీమ్ సేఫేనా..
RCB vs KKR IPL 2025

ఐపీఎల్ 2025 సీజన్ మరికొన్ని గంటల్లో షురూ అయిపోతుంది. టోర్నమెంట్ ఓపెనర్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు పోటీపడనున్నాయి. కోల్‌కతాలోని పాపులర్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఈ మ్యాచ్‌కు హోస్ట్‌గా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా కోల్‌కతాలో వరుసగా వర్షాలు పడుతుండటం, ఇవాళ పొద్దున కూడా వానలు కురవడంతో మ్యాచ్ జరుగుతుందా.. లేదా.. అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ రద్దయితే.. రెండింట్లో ఏ జట్టుకు ఎక్కువ నష్టం.. కోహ్లీ టీమ్ సేఫేనా.. కాదా.. అనేది ఇప్పుడు చూద్దాం..


అన్ని ఓవర్ల వరకు..

ఒకవేళ ఇవాళ్టి మ్యాచ్ రద్దయితే దీన్ని తిరిగి నిర్వహించే అవకాశం లేదు. ఎందుకంటే రిజర్వ్ డే లేదు. ఐపీఎల్‌లో లీగ్ మ్యాచులకు రిజర్వ్ డే ఉండదు. ప్లేఆఫ్స్‌లోని ఎలిమినేటర్, క్వాలిఫయర్స్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌‌కు మాత్రమే రిజర్వ్ డే ఉంటుంది. కాబట్టి ఒకవేళ వరుణుడి కారణంగా ఫస్ట్ మ్యాచ్ రద్దయితే ఆర్సీబీ-కేకేఆర్ రెండు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. వాన వల్ల మ్యాచ్ లేట్ అయినా.. మ్యాచ్ క్లోజ్ అవడానికి నిర్ణీత సమయం కంటే మరో గంట ఎక్స్‌ట్రా టైమ్ ఇస్తారు. రిజల్ట్ తేల్చేందుకు ఇరు టీమ్స్ కనీసం 5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసే చాన్స్ ఉంటుంది.


రిజల్ట్ రాకపోతే..

ఐదు ఓవర్ల మ్యాచ్‌కు కటాఫ్ టైమ్ రాత్రి 10 గంటల 56 నిమిషాలు. అర్ధరాత్రి 12 గంటల 6 నిమిషాల వరకు మ్యాచ్ పూర్తవ్వాలి. ఒకవేళ వరుణుడి కారణంగా మ్యాచ్ మరీ లేట్ అయితే ఓవర్ల సంఖ్యను మరింత కుదించే అవకాశం ఉంటుంది. ఇంత చేసినా రిజల్ట్ రాకపోతే అప్పుడు మ్యాచ్ రద్దు చేసి రెండు జట్లకు చెరో చెరో పాయింట్ ఇస్తారు. కప్పు రేసులో ఒక్కో పాయింట్ ఎంతో కీలకం. కాబట్టి అటు ఆర్సీబీ, ఇటు కేకేఆర్ ఫ్యాన్స్ పూర్తి మ్యాచ్ జరగాలనే కోరుకుంటున్నారు. కాగా, ప్రస్తుతం ఈడెన్ గార్డెన్స్‌లోకి ఆడియెన్స్ రాక మొదలైపోయింది. ఇవాళ పొద్దున వరకు నల్లటి మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో మ్యాచ్ జరగదని అనుకున్నా.. ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయిపోయింది. వాన పోయి ఎండ వచ్చేసింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.


ఇవీ చదవండి:

ఐపీఎల్ మ్యాచుల లైవ్ స్ట్రీమింగ్ అందులోనే..

ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్.. ఆర్సీబీదే పైచేయా..

ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్.. టోర్నీ ఓపెనర్‌‌లో గెలుపెవరిది

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 22 , 2025 | 04:17 PM