IPL 2025 Live Streaming India: ఐపీఎల్ మ్యాచుల లైవ్ స్ట్రీమింగ్.. ఎందులో చూడాలంటే..
ABN , Publish Date - Mar 22 , 2025 | 02:26 PM
RCB vs KKR IPL 2025 Live Streaming: ఐపీఎల్ పండుగ వచ్చేసింది. సమ్మర్‌లో ధనాధన్ ఆటతో మరింత హీటెక్కించేందుకు ఆటగాళ్లు కూడా రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాష్ రిచ్ లీగ్ మ్యాచుల లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ నయా సీజన్ మరికొన్ని గంటల్లో షురూ కానుంది. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా సాయంత్రం 7.30 గంటలకు స్టార్ట్ కానుంది. ఇవాళ జరిగే తొలిపోరులో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఇక నుంచి రోజుకు కనీసం ఒక మ్యాచ్.. అలాగే డబుల్ హెడర్స్ కూడా జరగనున్నాయి. మొత్తంగా 74 మ్యాచులు జరుగుతాయి. అందులో 70 లీగ్ మ్యాచులు, 2 క్వాలిఫయర్స్, ఒక ఎలిమినేటర్.. అలాగే ఫైనల్ మ్యాచ్ ఉంది. మరి.. ఈ పోరాటాలను ఎక్కడ లైవ్ స్ట్రీమింగ్ చేయాలి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇలా చూసేయండి..
ఐపీఎల్ మ్యాచుల టెలికాస్టింగ్ హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ సంస్థ కలిగి ఉంది. అన్ని మ్యాచులు దీనికి సంబంధించిన చానళ్లలో ప్రసారం అవుతాయి. జియోస్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు. టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్ 1 ఎస్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 1 హెడ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 2 ఎస్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 2 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ హిందీ ఎస్‌డీ, స్టార్ స్పోర్ట్స్ హిందీ హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళ్ ఎస్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళ్ హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఎస్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడ ఎస్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడ హెచ్‌డీలో మ్యాచుల్ని చూడొచ్చు.
ఇవీ చదవండి:
ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్.. ఆర్సీబీదే పైచేయా..
RCB vs KKR ఫస్ట్ ఫైట్.. ప్లేయింగ్ 11 రివీల్డ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి