Team India: విడాకులకు సిద్ధమైన టీమిండియా స్టార్.. భార్య ఫొటోలు డిలీట్..
ABN , Publish Date - Jan 04 , 2025 | 03:22 PM
Yuzvendra Chahal Divorce: టీమిండియా స్టార్ క్రికెటర్ విడాకుల వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భార్యకు సంబంధించిన ఫొటోలను అతడు డిలీట్ చేయడంతో పక్కా డివోర్స్ తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు. అసలు ఏమైంది? ఎవరా స్టార్ కపుల్? అనేది ఇప్పుడు చూద్దాం..
Yuzvendra Chahal-Dhanasree Verma: క్రికెట్‌లో ఎన్నో జంటలు ఉన్నా అందులో కొన్ని మాత్రం బాగా ఫేమస్. విరాట్ కోహ్లీ అతడి సతీమణి అనుష్క శర్మ, అలాగే రోహిత్ శర్మ అతడి భార్య రితికా సజ్దే వెరీ పాపులర్. వీళ్ల రేంజ్‌లో కాకపోయినా ఇండియన్ క్రికెట్‌కు సంబంధించి క్రేజీ కపుల్ లిస్ట్‌లో వచ్చే మరో జంటే స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ. రీల్స్, డ్యాన్సులతో సోషల్ మీడియాలో ఈ జంట చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ధనశ్రీ డ్యాన్సింగ్ కెరీర్‌కు చాహల్, అతడి క్రికెట్ కెరీర్‌కు ధనశ్రీ సపోర్ట్ ఉంటూ ఆదర్శ జంటగా పేరు తెచ్చుకున్నారు. అయితే వీళ్లిద్దరూ విడాకులకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఒకర్నొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకోవడంతో డివోర్స్ వార్తలకు మరింత బలం చేకూరింది.
చాహల్ ఒకలా.. ధనశ్రీ మరోలా..
యుజ్వేంద్ర చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ధనశ్రీ ఫొటోలను డిలీట్ చేసేశాడు. దీంతో ఈ స్టార్ కపుల్ విడిపోతారనే ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే చాహల్‌ను అన్‌ఫాలో చేసినప్పటికీ అతడితో దిగిన ఫొటోలను మాత్రం ధనశ్రీ డిలీట్ చేయలేదు. వీళ్లిద్దరూ విడాకులు తీసుకోవడం ఖాయం, ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసేందుకు కాస్త టైమ్ పడుతుందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇంత అన్యోన్యంగా, ప్రేమగా ఉండే దంపతులు ఎందుకు విడిపోతున్నారనే దానికి కచ్చితమైన కారణాలు మాత్రం ఇంకా తెలీదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రేమ నుంచి పెళ్లి దాకా..
చాహల్-ధనశ్రీ విడాకుల వార్త తెలిసిన క్రికెట్ లవర్స్ బాధపడుతున్నారు. ఇంత బ్యూటిఫుల్ కపుల్ విడిపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. అయితే డివోర్స్‌పై ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఏదీ చెప్పలేం. కాగా, ముంబైకి చెందిన డెంటిస్ట్, కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ దగ్గర డ్యాన్స్ క్లాసులకు వెళ్లేవాడు చాహల్. అలా వాళ్ల పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లిపీటల వరకు వచ్చింది. 2020లో వీళ్లిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. గతంలో వీళ్లు నెట్టింట పెట్టిన పలు పోస్టులు డివోర్స్ తీసుకుంటారనే అనుమానాలకు దారితీసింది. తాము విడిపోవడం లేదంటూ దీనిపై చాహల్ ఒకసారి క్లారిటీ ఇచ్చాడు. కానీ తాజాగా సతీమణి ఫొటోలు డిలీట్ చేయడంతో మరోసారి విడాకుల అంశం చర్చనీయాంశంగా మారింది.