Share News

India Vs Australia: మరోసారి టీమిండియా టాప్ ఆర్డర్ విఫలం.. స్కోర్ ఏంతంటే..

ABN , Publish Date - Jan 03 , 2025 | 07:46 AM

ఆసీస్ జట్టుతో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచులో టీమిండియా టాప్ ఆర్డర్ మరోసారి విఫలమైంది. తొలి ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు 21 ఓవర్లకే పెవిలియన్‌ చేరుకున్నారు. ప్రస్తుతం టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 57 పరుగులు మాత్రమే చేసింది.

India Vs Australia: మరోసారి టీమిండియా టాప్ ఆర్డర్ విఫలం.. స్కోర్ ఏంతంటే..
Indias Top Order Fails Again 5th Test

టీమిండియా (team india), ఆస్ట్రేలియా (Australia) మధ్య ఈరోజు(జనవరి 3, 2025న) మొదలైన చివరి టెస్టు మ్యాచ్‌లో కూడా భారత్ టాప్ ఆర్డర్ మరోసారి విఫలమైంది. టీమిండియా మంచి పోటీ ఇవ్వాలని భావించినప్పటికీ, మొదటి ముగ్గురు కీలక ఆటగాళ్లు ఇప్పటికే ఔట్ కావడం భారత జట్టుకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఈ క్రమంలో 21 ఓవర్లలోనే 57 పరుగులు చేయగానే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి, భారత జట్టు 57 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ 20 పరుగులతో, విరాట్ కోహ్లీ 12 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ 35+ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, లంచ్ బ్రేక్ తర్వాత కూడా జట్టుకు మరిన్ని పరుగులు చేయాలని ప్రయత్నిస్తున్నారు.


ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు ఔట్ కావడం

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట కేఎల్ రాహుల్ నాలుగు పరుగులు చేసి మిచెల్ స్టార్క్‌కు బలయ్యాడు. తర్వాత 17 పరుగుల వద్ద జైస్వాల్ స్లిప్‌లో క్యాచ్ ఇవ్వడంతో మరో వికెట్ పడిపోయింది. 8వ ఓవర్‌లో కోహ్లీ క్రీజులో అడుగుపెట్టాడు. ఇదే క్రమంలో తొలి సెషన్ చివరి బంతికి భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శుభ్‌మన్ గిల్ నాథన్ లియాన్‌కి ఔటయ్యాడు. స్లిప్‌లో స్టీవ్ స్మిత్ చేతికి చిక్కాడు. గిల్ 64 బంతుల్లో 20 పరుగులు చేశాడు. భారత్ స్కోరు 57 పరుగులకు 3 వికెట్లు. కాగా విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ కాకుండా, ఫీల్డర్ స్మిత్ స్లిప్‌లో డైవ్ చేస్తూ క్యాచ్ మిస్ చేయడంతో సేఫ్ అయ్యాడు.


భారత్‌కు డూ ఆర్ డై

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కూడా లేరు. ఈ మ్యాచ్ కోసం విశ్రాంతి తీసుకోగా, జట్టులో ఆయన లేని భవిష్యత్తుపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే టి20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, ఇప్పుడు టెస్టుల్లో కూడా కొనసాగడంపై అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. జట్టులో శుభ్‌మన్ గిల్, రోహిత్ స్థానంలో వచ్చిన ఆకాష్ దీప్ వంటి మార్పులు జరిగాయి. రోహిత్ శర్మ ప్లే 11 నుంచి తప్పుకుని జట్టు నాయకత్వం బుమ్రా తీసుకున్నారు. బుమ్రా నేతృత్వంలో టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ భారత్‌కు డూ ఆర్ డైగా మారింది. ఈ టెస్టులో ఆస్ట్రేలియా జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవకపోతే బీజీటీ ట్రోఫీని కోల్పోవాల్సి వస్తుంది.


ఆస్ట్రేలియా జట్టు నుంచి భారీ పోటీ

మరోవైపు ఆస్ట్రేలియా జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. బౌలర్లలో ప్రధానంగా మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్ సహా ఇతరులు భారత ఆటగాళ్లను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఆధిక్యంలో ఉంది.

భారత జట్టు: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (WK), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా (c), మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా జట్టు: సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (WK), పాట్ కమిన్స్ (c), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.


ఇవి కూడా చదవండి:

క్రీడా రత్నాలు గుకేష్‌, మను


రిలయన్స్‌ జియో రూ.40,000 కోట్ల ఐపీఓ!


Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..


Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Jan 03 , 2025 | 08:06 AM