Share News

Sports Awards: జాతీయ క్రీడా అవార్డుల ప్రదానం.. ఖేల్‌రత్న అందుకున్న మను, గుకేశ్

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:51 PM

2024 ఏడాదికి గానూ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు శుక్రవారం జాతీయ అవార్డులు ప్రదానం చేశారు. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్, చెస్ చాంపియన్ గుకేశ్ ఖేల్‌రత్న పురస్కారాలను అందుకున్నారు.

Sports Awards: జాతీయ క్రీడా అవార్డుల ప్రదానం.. ఖేల్‌రత్న అందుకున్న మను, గుకేశ్
National Sports Awards

2024 సంవత్సరంలో క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం నాడు జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్‌తో పాటు ఇతర ప్రపంచ క్రీడల్లో పతకాలు కొల్లగొట్టిన వారికి పురస్కారాలు అందజేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారాన్ని ప్రముఖ షూటర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్‌తో పాటు చెస్ చాంపియన్ గుకేశ్ అందుకున్నాడు. వీళ్లిద్దరితో పాటు హాకీ విభాగంలో హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ కేటగిరీలో ప్రవీణ్‌ కుమార్ అవార్డులు అందుకున్నారు.


మెరిసిన తెలుగు తేజాలు!

జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానంలో తెలుగు క్రీడాకారులు తళుక్కుమన్నారు. తెలుగు అథ్లెట్లు జ్యోతి యర్రాజి, దీప్తి జీవాంజి అర్జున పురస్కారాలు అందుకున్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. ఇందులో మొత్తం 4 మంది ఆటగాళ్లకు ఖేల్‌రత్న, 32 మందికి అర్జున అవార్డులు, అలాగే 3 మంది కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులు ప్రకటించింది. వీళ్లందరికీ రాష్ట్రపతి భవన్‌లో ఇవాళ జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ ముర్ము పురస్కారాలు ప్రదానం చేశారు.


ఇవీ చదవండి:

10 పాయింట్లతో బీసీసీఐ ప్రక్షాళన షురూ

బ్యాటింగ్‌ కోచ్‌గా సితాన్షు కోటక్‌

ఇంగ్లండ్‌ టూర్‌లో మూడు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 17 , 2025 | 12:53 PM