Home » President Murmu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు జలశక్తి అవార్డులు వచ్చాయి. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ అధికారులు అవార్డులను స్వీకరించారు.
న్యాయవాదులు సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు న్యాయం అందించేందుకు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. న్యాయవాద వృత్తిలో నిబద్ధత, పారదర్శకంగా పనిచేస్తే ఎంతో ఎత్తుకు ఎదగవచ్చన్నారు.
లోక్సభలో బీజేపీకి సొంతగా సంపూర్ణ మెజారిటీ లేనప్పటికీ జమిలి ఎన్నికలు నిర్వహించాలని గట్టి పట్టుదలగా ఉంది. ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’కు పార్టీలకతీతంగా మద్దతు లభిస్తుందని మోదీ సర్కారు ఆశాభావంతో ఉంది.
కక్షిదారులకు సత్వర న్యాయం అందాలంటే కోర్టుల్లోని ‘వాయిదాల సంస్కృతి’ని మార్చాల్సి ఉందని ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు.
మొట్టమొదటి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. గురువారం రాష్ట్రపతిభవన్లోని గణతంత్ర మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(బెంగళూరు) మాజీ డైరెక్టర్, బయోకెమిస్ట్ గోవింద్రాజన్ పద్మనాభన్ను దేశ అత్యున్నత సైన్స్ అవార్డుతో సత్కరించారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వచ్చే నెలలో విదేశీ పర్యటన చేయనున్నారు. ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆరో రోజుల పాటు ఫిజీ, న్యూజిలాండ్, తూర్పు తైముర్ దేశాల్లో ఆమె పర్యటించనున్నారు. తొలుత ఆగస్ట్ 5వ తేదీన ఫిజీకి ఆమె చేరుకుంటారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వరుసగా ఏడోసారి పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి ఈ రోజు (మంగళవారం) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
రాజ్యాంగ పరిరక్షణ పేరుతో కొందరు దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విపక్షాలను విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ కేంద్రప్రభుత్వం తరపున ప్రధాని మంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు.
ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు నిజాయితీగా, పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలోని యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు సరైన అవకాశాలను కల్పించడం ప్రభుత్వం కనీస బాధ్యత అని, పోటీ పరీక్షలైనా, ప్రభుత్వ నియామకమైనా ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడాలని ఆమె పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ అంశం దేశవ్యాప్తంగా
దేశాభివృద్ధి ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆకాంక్షించారు.. 18వ లోక్సభ తొలి సమావేశాల నాలుగోరోజు ఆమో పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి మాట్లాడారు. గత పదేళ్లలో కేంద్రప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు.. రానున్న ఐదేళ్లలో ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆమె తన ప్రసంగంలో వివరించారు.