Rohit Sharma: రోహిత్ ఖాతాలో చెత్త రికార్డు.. ఇది అస్సలు ఊహించలేదు
ABN , Publish Date - Mar 23 , 2025 | 09:43 PM
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మూడో స్థానంలో నిలిచిన రోహిత్ శర్మ ఖాతాలో మరో చెత్త రికార్డు కూడా నమోదైంది. ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం నాలుగు బంతులు మాత్రమే ఆడి అవుటైన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మూడో స్థానంలో నిలిచిన రోహిత్ శర్మ (Rohit Sharma) ఖాతాలో మరో చెత్త రికార్డు కూడా నమోదైంది. ఐపీఎల్ 2025లో (IPL 2025) భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో (CSK vs MI) జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం నాలుగు బంతులు మాత్రమే ఆడి అవుటైన సంగతి తెలిసిందే. ఇలా పరుగులేమీ చేయకుండా డకౌట్ కావడం రోహిత్ శర్మ ఐపీఎల్ కెరీర్‌లో ఇది 18వ సారి. దీంతో రోహిత్ ఖాతాలోకి ఓ చెత్త రికార్డు చేరింది (Rohit Record).
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ మరో ఇద్దరు ఆటగాళ్లతో కలిసి అగ్రస్థానంలోకి చేరుకున్నాడు. రోహిత్ కంటే ముందు దినేష్ కార్తీక్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా 18 సార్లు ఐపీఎల్ కెరీర్లో డకౌట్ అయ్యారు. ఇక, ఆ తర్వాత పియూష్ చావ్లా, సునీల్ నరైన్ 16 సార్లు డకౌట్ అయి తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్‌తో రోహిత్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు (258) ఆడిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న దినేష్ కార్తీక్ (257)ను దాటేశాడు. తొలి స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ (265) కొనసాగుతున్నాడు.
ఇవి కూడా చదవండి..
SRH vs RR: పోరాడి ఓడిన రాజస్తాన్.. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌దే విజయం
SRH vs RR: ఇషాన్ కిషన్ మెరపు శతకం.. రాజస్తాన్ రాయల్స్ టార్గెట్ ఎంతంటే
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..