Share News

SRH vs RR: పోరాడి ఓడిన రాజస్తాన్.. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌దే విజయం

ABN , Publish Date - Mar 23 , 2025 | 07:35 PM

హైదరాబాద్‌లో క్రికెట్ ప్రేమికులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందింది. ఇరు జట్ల బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపించి అభిమానులను అలరించారు. హైదరాబాద్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్ బ్యాటర్లు కూడా ధీటుగానే స్పందించారు. అయితే వారి పోరాటం సరిపోలేదు.

SRH vs RR: పోరాడి ఓడిన రాజస్తాన్.. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌దే విజయం
SRH vs RR

హైదరాబాద్‌లో క్రికెట్ ప్రేమికులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందింది. ఇరు జట్ల బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపించి అభిమానులను అలరించారు. హైదరాబాద్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్ బ్యాటర్లు కూడా ధీటుగానే స్పందించారు. అయితే వారి పోరాటం సరిపోలేదు. దీంతో హైదరాబాద్ చేతిలో రాజస్తాన్ జట్టు 45 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు మాత్రమే చేయగలిగింది.


టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్తాన్ జట్టుకు హైదరాబాద్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 4 సిక్స్‌లు, 9 ఫోర్లతో 100) మెరపు శతకంతో తన సత్తా చాటాడు. ఐపీఎల్‌లో తొలి సెంచరీ చేశాడు. ట్రావిస్ హెడ్ (31 బంతుల్లో 3 సిక్స్‌లు, 9 ఫోర్లతో 67) అద్బుత ఆరంభాన్ని అందించాడు. అందరూ సమష్టిగా రాణించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లు అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అందరూ ఓవర్‌కు దాదాపు 10 పరుగులు ఇచ్చారు. తీక్షణ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. దేశ్‌పాండే మూడు వికెట్లు తీశాడు. సందీప్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.


287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు మంచి ఆరంభం దక్కలేదు. 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో ధ్రువ్ జురెల్ (35 బంతుల్లో 6 సిక్స్‌లు, 5 ఫోర్లతో 70), సంజూ శాంసన్ (37 బంతుల్లో 4 సిక్స్‌లు, 7 ఫోర్లతో 66) విజయంపై ఆశలు రేకెత్తించారు. వారు అవుటైన తర్వాత విజయంపై ఆశలు సన్నగిల్లాయి. అయితే చివర్లో హెట్ మేయర్ (23 బంతుల్లో 42), శుభమ్ దూబే (11 బంతుల్లో 34) పోరాడారు. కానీ అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడంతో రాజస్తాన్ టీమ్‌కు ఓటమి తప్పలేదు. హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్, సిమర్జీత్ సింగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. షమీ, ఆడమ్ జంపా ఒక్కో వికెట్ తీశారు.


ఇవి కూడా చదవండి..

SRH vs RR: ఇషాన్ కిషన్ మెరపు శతకం.. రాజస్తాన్ రాయల్స్ టార్గెట్ ఎంతంటే


Virat Kohli - Rinku Singh: కోహ్లిని రింకూ సింగ్ అవమానించాడా.. వేదిక మీద షేక్ హ్యండ్ ఇవ్వకపోవడంతో చర్చ


MS Dhoni: నేను వీల్‌ఛైర్‌లో ఉన్నా.. సీఎస్కే వాళ్లు లాక్కెళ్తారు: ఎంఎస్ ధోనీ


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2025 | 07:51 PM