Share News

Niharika Konidela: సినిమాలో కథ, కథనం బాగుంటేనే ఆదరణ

ABN , Publish Date - Jan 05 , 2025 | 09:09 AM

మనం తీసే సినిమాలో కథ, కథనం బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడతారని, అలాంటి సినిమాలు నష్టపోయే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయని సినీ నిర్మాత, నటి నిహారిక కొణిదెల(Film producer and actress Niharika Konidela) అన్నారు.

Niharika Konidela: సినిమాలో కథ, కథనం బాగుంటేనే ఆదరణ

- అప్తా క్యాటలిస్ట్‌ గ్లోబల్‌ బిజినెస్‌ కాన్ఫరెన్స్‌లో నిహారిక కొణిదెల

హైదరాబాద్‌ సిటీ: మనం తీసే సినిమాలో కథ, కథనం బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడతారని, అలాంటి సినిమాలు నష్టపోయే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయని సినీ నిర్మాత, నటి నిహారిక కొణిదెల(Film producer and actress Niharika Konidela) అన్నారు. హైటెక్స్‌లో జరుగుతున్న ఆప్తా క్యాటలిస్ట్‌ గ్లోబల్‌ బిజినెస్‌ కాన్ఫరెన్స్‌ సదస్సులో ‘ఉమెన్‌ ఇన్‌ ద బిజినెస్‌ ఆఫ్‌ సినిమా (సినిమా వ్యాపారంలో మహిళలు)’ అనే అంశంపై సినీ నిర్మాత సునీత తాటితో కలిసి ఆమె పలు అంశాలపై మాట్లాడారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కేక్‌ల ట్రేల్లో ఎలుకల మలం..


city2.jpg

‘గుండమ్మ కథ’ లాంటి సినిమాల్లో మహిళల పాత్రలు చాలా బలంగా ఉండేవి. అక్కడ కథే రాజు. ఆ కథలో మహిళలు కీలకంగా ఉండేవారు. ఇప్పుడు అలాంటి పాత్రలు రావడం లేదు. హీరోయిన్‌లను హీరో-విలన్‌లు ముఖాముఖి తలపడటానికి సంధానకర్తలుగా మాత్రమే చూస్తున్నారని పేర్కొన్నారు. సినిమా స్ర్కిప్ట్‌లో మొత్తంమీద అరపేజీ కూడా హీరోయిన్‌ క్యారెక్టర్‌(Heroine character) ఉండటం లేదన్నది ఇప్పటి నిజం అని పేర్కొన్నారు. ఇప్పటి కథలు హీరో నేపథ్యంలోనే ఎక్కువగా వస్తున్నాయని, అందుకు ప్రేక్షకులు హీరోలను అమితంగా అభిమానించడం ఓ కారణమని తెలిపారు. సినిమా అనేది మనీ మేకింగ్‌ బిజినెస్‌ అని వెళ్తే కష్టమని, అభిరుచి కూడా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.


ఈవార్తను కూడా చదవండి: ‘తెలుగు‘లో చదివితే ఉద్యోగాలు రావన్నది అపోహే

ఈవార్తను కూడా చదవండి: KTR: కేంద్రంలో చక్రం తిప్పుతాం

ఈవార్తను కూడా చదవండి: DK Aruna: చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగాలి

ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం అభివృద్ధిపై మంత్రి తుమ్మల కీలక నిర్ణయాలు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 05 , 2025 | 09:09 AM