Madhavi Latha: మాధవీలత సంచలన నిర్ణయం..
ABN , Publish Date - Jan 18 , 2025 | 01:37 PM
Madhavi Latha: మాధవిలత కీలక నిర్ణయం తీసుకుంది. తనపై పరుష వ్యాఖ్యలు చేసిన జేసీని వదిలిపెట్టేదే లేదంటూ అడుగు ముందుకేసింది. జేసీపై ఫిల్మ్ ఛాంచర్‌లో కంప్లైంట్ ఇచ్చింది. అంతేకాదు..

హైదరాబాద్, జనవరి 18: సినీ నటి మాధవీలత కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. జేసీ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని మాధవీలత కోరారు. ఇదే విషయమై హెచ్ఆర్సీ, పోలీసులకు సైతం ఆమె ఫిర్యాదు చేశారు. జేసీపై ఫిర్యాదు చేసిన సందర్భంగా మాట్లాడిన మాధవిలత.. జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై దారుణంగా మాట్లాడారన్నారు. జేసీ వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఖండించలేదని.. ఈ కారణంగానే మూవీఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఫిర్యాదుచేశానని చెప్పారామె. ‘మా’ ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే స్పందించారన్నారు. తన ఫిర్యాదును మంచు విష్ణు దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదని, వ్యక్తిత్వ హననడం చేయడం దారుణం అని మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని నటుడు శివబాలాజీ సూచించారు. వ్యక్తిగత జీవితాలపై రాజకీయ నాయకులు కామెంట్స్ చేయడం సరికాదన్నారు. రాజకీయ నాయకులు ఇండస్ట్రీ జోలికి రావొద్దన్నారు. మాధవీలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ‘మా’ ట్రెజరర్ శివబాలాజీ తెలిపారు.
ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు ఇస్తున్న మాధవీలత..
Also Read:
విష్ణుపై ఇంట్రస్టింగ్ ట్వీట్ చేసిన మనోజ్..
నాగసాధువుగా మారడం ఎలా.. రూల్స్ ఏంటి..
ఇలా చేస్తే.. సొంతూళ్లోనే నెలకి రూ.50 వేలు సంపాదించొచ్చు..
For More Telangana News and Telugu News