Share News

Adilabad: గ్రామస్తుల దాడి.. బీట్ ఆఫీసర్‌కు గాయాలు..

ABN , Publish Date - Jan 05 , 2025 | 01:58 PM

ఆదిలాబాద్ జిల్లా, కేశవపట్టణం గ్రామం మొదటి నుంచి కలప స్మగ్లింగ్‌కు పేరుగాంచింది. ఈ గ్రామంలో చాలా మంది కలప స్మిగ్లింగ్ చేసి జీవనోపాధిని పొందుతారు. అయితే గ్రామంలో పెద్ద మొత్తంలో కలప నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో అటవీశాఖ అధికారుల బృందాలు అక్కడకు వెళ్లాయి. ఇళ్లల్లో ఉన్న కలపను స్వాధీనం చేసుకునే క్రమంలో ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

Adilabad: గ్రామస్తుల దాడి.. బీట్ ఆఫీసర్‌కు గాయాలు..

ఆదిలాబాద్ జిల్లా: ఇచ్చోడలోని కేశవపట్టణం (Kesavapatnam)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటవీ అధికారుల (Officers)పై గ్రామస్తులు (Villagers) దాడి (Attack) చేశారు. అక్రమ నిలువలు ఉన్నాయన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు కార్డ్ ఆన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురి ఇళ్లల్లో భారీగా కలప దుంగలు, ఫర్నీచర్ లభ్యమైంది. కలప దుంగలను స్వాధీనం చేసుకుంటున్న అధికారులపై గ్రామస్తులు తిరబడ్డారు. వారిపైదాడి చేయడంతోపాటు వాహనాలను ధ్వంసం చేశారు. గ్రామస్తుల దాడిలో ఓ బీట్ ఆఫీసర్‌కు గాయాలయ్యాయి. అటవీశాఖ అధికారుల సమాచారంతో గ్రామానికి పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి. పరిస్థితి అదుపుతప్పకుండా పోలీసులు గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పికేటింగ్ కొనసాగుతోంది.


ఆదిలాబాద్ జిల్లా, కేశవపట్టణం గ్రామం మొదటి నుంచి కలప స్మగ్లింగ్‌కు పేరుగాంచింది. ఈ గ్రామంలో చాలా మంది కలప స్మిగ్లింగ్ చేసి జీవనోపాధిని పొందుతారు. అయితే గ్రామంలో పెద్ద మొత్తంలో కలప నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో అటవీశాఖ అధికారుల బృందాలు అక్కడకు వెళ్లాయి. ఇళ్లల్లో ఉన్న కలపను స్వాధీనం చేసుకునే క్రమంలో ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అధికారులు తమ ఇళ్లల్లో అక్రమంగా చొరబడి.. దురుసుగా ప్రవర్తించారని గ్రామస్తులు పేర్కొంటూ అధికారులపై తిరగబడ్డారు. తమ గ్రామంలోకి అధికారులు రావద్దని గ్రామస్తులు అంటున్నారు. అయితే గతంలో కూడా గ్రామస్తులకు కలప స్మగ్లింగ్ చేయవద్దని చాలా సార్లు చెప్పామని, అయినా వారు వినలేదని, ఈ నేపథ్యంలో తాము కార్డ్ ఆన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా గ్రామస్తులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న కలపను అటవీ కార్యాలయానికి తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే గ్రామస్తులు మాత్రం తమ అవసరాల కోసం ఉంచుకున్న కలప అని, ఎలా తీసుకుపోతారని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పికేటింగ్ కొనసాగుతోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

గాడి తప్పిన పాలనను సరిచేస్తున్నాం: లోకేష్‌

కోతలపాలన.. ఎగవేతల ప్రభుత్వం..: ఎంపీ డాక్టర్ లక్ష్మణ్

హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు..

మోసానికి మారు పేరు కాంగ్రెస్: కేటీఆర్

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్..

విశాఖ కలెక్టరేట్‌లో మంత్రి లోకేష్ సమీక్ష సమావేశం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 05 , 2025 | 01:58 PM