Share News

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Jan 13 , 2025 | 10:51 PM

మంచిర్యాల పట్టణం గోదావరి రోడ్డులో చేపట్టిన మహా ప్రస్తాన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అధికారులను ఆదేశించారు. పనులను పరిశీలించిన అనంతరం మంచిర్యాల మార్కెట్‌ ఏరియాలో పర్యటించారు. మార్కెట్‌ ఏరియాలో రోడ్డు విస్తరణ పనులు మంద కొడిగా సాగుతున్నాయని, అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

మంచిర్యాల క్రైం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): మంచిర్యాల పట్టణం గోదావరి రోడ్డులో చేపట్టిన మహా ప్రస్తాన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అధికారులను ఆదేశించారు. పనులను పరిశీలించిన అనంతరం మంచిర్యాల మార్కెట్‌ ఏరియాలో పర్యటించారు. మార్కెట్‌ ఏరియాలో రోడ్డు విస్తరణ పనులు మంద కొడిగా సాగుతున్నాయని, అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డు వెడల్పు కార్యక్రమం పూర్తి చేసి నగర సుందరీకరణ చేపట్టాలని, పండగ సందర్భంలో మార్కెట్‌ ఏరియాలో ట్రాఫిక్‌ సమస్య లేకుండా ఉండేందుకు పనులు చేపడుతున్నామన్నారు. భూగర్భ మురికి కాలువ ప్రణాళికను ముఖ్యమంత్రికి రేవంత్‌రెడ్డికి అందించామన్నారు. మార్కెట్‌ రోడ్డు, మెయిన్‌ రోడ్డు, శ్రీనివాసటాకీస్‌ రోడ్డు, ఫుట్‌పాత్‌, భూగర్భ మురికి కాలువల నిర్మాణ పనులను త్వరలో చేపడుతామ న్నారు. ప్రతీ ఒక్కరు అభివృద్ధికి సహకరించాలని, పనులకు ఆటంకం కలిగించవద్దని కోరారు.

Updated Date - Jan 13 , 2025 | 10:52 PM