Share News

అంగరంగ వైభవంగా గోదారంగనాథుల కల్యాణం

ABN , Publish Date - Jan 13 , 2025 | 10:49 PM

గోదాదేవి రంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండగగా నిర్వహించారు. భాజభజంత్రీలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ కల్యాణం కమనీయంగా జరిగింది. ఆలయ అర్చకులు మోహనాచారి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు.

అంగరంగ వైభవంగా గోదారంగనాథుల కల్యాణం

దండేపల్లి, జనవరి 13(ఆంధ్రజ్యోతి) భోగి పండుగ పర్వదినం, ధనుర్మాస వ్రతంలో భాగంగా గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో సోమవారం గోదా రంగనాయకస్వామి(గోదాదేవి)కల్యాణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ముఖ్య అర్చకులు గోవర్ధన రఘస్వామి, సంపత్‌స్వామి, వేదపండితులు నారాయణశర్మ, భరత్‌శర్మ ఆధ్వర్యంలో కల్యాణం ఘనంగా జరిపించారు. స్వామికి పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి నిత్యపూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఈవో సంక టాల శ్రీనివాస్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ చంద్రశేఖర్‌, భక్తులు కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు.

నస్పూర్‌, (ఆంధ్రజ్యోతి): గోదావరి కాలనీ వేంకటేశ్వర ఆలయంలో గోదారంగనాథుల కల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ ప్రధానార్చకులు సముద్రాల లక్ష్మణాచార్యులు, వెంకటరమణాచార్యుల, నరేష్‌చార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ కమిటీ, వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కళ్యాణం అనంతరం భక్తులు స్వామి దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేంసాగర్‌రావు గోదారంగనాథుల స్వామిలను దర్శించారు. ఆలయ కమిటీ, వికాస తరంగిణి సభ్యులు డీసీసీ అధ్యక్షురాలును సన్మానించారు.

గర్మిళ్ల, (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది తీరంలో గల గౌతమేశ్వరాలయం రమా సహిత సత్యనారాయణ స్వామి సన్నిధిలో గోదాదేవి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. ఆలయ ఫౌండర్‌ గోపగాని శ్రీధర్‌, పోగ్రాం చైర్మన్‌ శ్రీనివాస్‌, వాసవీ క్లబ్‌ రీజియన్‌ చైర్మన్‌ వంశీకృష్ణ, సెక్రెటరీ ప్రవీణ్‌, సత్యనారాయణ, సురేందర్‌, మహేష్‌, సత్యనారాయణ, రాజేంద్రప్రసాద్‌ భక్తులు పాల్గొన్నారు.

మందమర్రిటౌన్‌, (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని వేంకటేశ్వరాలయంలో సోమవారం రాత్రి గోదా దేవి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ పండితులు అనంతాచార్యులు ఆధ్వర్యంలో కల్యాణం ఘనంగా జరిగింది. జీఎం దేవేందర్‌ దంపతులు, ఎస్‌వోటూ జీఎం విజయ్‌ ప్రసాద్‌ దంపతులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు పండితులు తీర్ధ ప్రసాదాలను అందజేశారు.

చెన్నూరు, (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని జగన్నాథస్వామి ఆలయంలో గోదాదేవి రంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండగగా నిర్వహించారు. భాజభజంత్రీలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ కల్యాణం కమనీయంగా జరిగింది. ఆలయ అర్చకులు మోహనాచారి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. అనంతరం తీర్ధ ప్రసాదాలను అందజేశారు. అర్చకులు అజయ్‌చారి, అనిల్‌చారి, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2025 | 10:49 PM