Share News

అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల వినూత్న నిరసన

ABN , Publish Date - Jan 13 , 2025 | 10:47 PM

సమస్యలు పరిష్కరించాలని సోమవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మి కులు ఆకులు తింటూ నిరసన తెలిపారు. సీఐటీ యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణ, రంజిత్‌ కుమార్‌లు మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు యూనిఫాం, గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదని, వేతనాల చెల్లింపుల విష యంలో అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు.

అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల వినూత్న నిరసన

బెల్లంపల్లి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని సోమవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మి కులు ఆకులు తింటూ నిరసన తెలిపారు. సీఐటీ యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణ, రంజిత్‌ కుమార్‌లు మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు యూనిఫాం, గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదని, వేతనాల చెల్లింపుల విష యంలో అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ విషయం అధికారులకు చెప్పినా పట్టించు కోవడం లేదన్నారు. వెం టనే అధికారులు స్పం దించి పెండింగ్‌లో ఉన్న 5 నెలల వేతనాలను చెల్లించడంతో సమ స్యలను పరిష్కరిం చాలని కోరారు. లేకుంటే ఈ నెల 20న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తా మని పేర్కొన్నారు. ీ శ్రీనివాస్‌, దేవదాస్‌, కార్మికులు పాల్గొన్నారు.

వేతనాలు రాక ఇబ్బందులు

మందమర్రిరూరల్‌, (ఆంధ్రజ్యోతి): ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌లకు వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నామని ఫీల్డ్‌ అసిస్టెంట్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఈద లింగయ్య పేర్కొన్నారు. నవంబర్‌ నుంచి జనవరి వరకు వేతనాలు రాలేదని, పండగ పూట పస్తులుండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ప్రభుత్వం వేతనాలను విడుదల చేయాలని కోరారు.

Updated Date - Jan 13 , 2025 | 10:47 PM