Share News

Homeguards : కుటుంబం ఆంధ్రాలో.. ఉద్యోగం తెలంగాణలో!

ABN , Publish Date - Jan 14 , 2025 | 04:05 AM

వారి కుటుంబాలు ఆంధ్రాలో ఉంటే వారేమో తెలంగాణలో ఉద్యోగం చేస్తున్నారు. ఒకటీ, రెండూ కాదు ఏకంగా 11 ఏళ్ల నుంచి వారి కుటుంబాలు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నాయి.

Homeguards : కుటుంబం ఆంధ్రాలో.. ఉద్యోగం తెలంగాణలో!

  • 11 ఏళ్లుగా పూర్తికాని హోంగార్డుల విభజన.. అల్లాడుతున్న కుటుంబాలు

హైదరాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : వారి కుటుంబాలు ఆంధ్రాలో ఉంటే వారేమో తెలంగాణలో ఉద్యోగం చేస్తున్నారు. ఒకటీ, రెండూ కాదు ఏకంగా 11 ఏళ్ల నుంచి వారి కుటుంబాలు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నాయి. రాష్ట్ర విభ జన తర్వాత అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందిని వారి స్థానికత ఆధారంగా ఆంధ్రా, తెలంగాణాల్లో సర్దుబాటు చేశారు. కానీ హోంగార్డుల విషయంలో మాత్రం ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకోకపోవడంతో ఏళ్ల తరబడి వీరి సమస్య పరిష్కారం కాలేదు. దాదాపు 400 మంది ఆంధ్రా స్థానికత కలిగిన హోంగార్డులు తెలంగాణలో పనిచేస్తున్నారు. అంతే సంఖ్యలో తెలంగాణకు చెందిన హోంగార్డులు ఆంధ్రాలో పనిచేస్తున్నారు. వారి కుటుంబాలకు దూరంగా వందల కిలోమీటర్ల దూరంలో విధులు నిర్వహిస్తున్నారు. తమ స్థానికత ఆధారంగా తమను సొంత రాష్ట్రానికి పంపాలని 11 ఏళ్లుగా హోంగార్డులు చేస్తున్న వినతులను ప్రభుత్వాలు పట్టించుకోలేదని... ఆంధ్రా, తెలంగాణలో ప్రజా అనుకూలమైన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన క్రమంలో ఈ సమస్యకు ముగింపు పలకాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విన్నవించారు.

Updated Date - Jan 14 , 2025 | 04:05 AM