BJP: బడంగ్‌పేట్, మీర్‌పేట్ బీజేపీ అధ్యక్షుల నియామకం
ABN , Publish Date - Jan 14 , 2025 | 08:47 AM
మహేశ్వరం నియోజకవర్గం(Maheshwaram Constituency)లోని బడంగ్‌పేట్, మీర్‌పేట్ కార్పొరేషన్లకు బీజేపీ(BJP) అధ్యక్షులను నియమించారు. ఆయా కార్పొరేషన్ల పరిధి విస్తరించడంతో గతానికి భిన్నంగా ఇద్దరేసి అధ్యక్షులను ఎంపిక చేశారు.
- ఒక్కో కార్పొరేషన్‌కు ఇద్దరు చొప్పున అధ్యక్షులు
- పరిధి విస్తరించడంతో పెరిగిన పదవులు
హైదరాబాద్: మహేశ్వరం నియోజకవర్గం(Maheshwaram Constituency)లోని బడంగ్‌పేట్, మీర్‌పేట్ కార్పొరేషన్లకు బీజేపీ(BJP) అధ్యక్షులను నియమించారు. ఆయా కార్పొరేషన్ల పరిధి విస్తరించడంతో గతానికి భిన్నంగా ఇద్దరేసి అధ్యక్షులను ఎంపిక చేశారు. బడంగ్‌పేట్, మీర్‌పేట్ కార్పొరేషన్లను రెండేసి భాగాలుగా విభజించి వేర్వేరుగా అధ్యక్షులను నియమించారు. ఇప్పటి దాకా బడంగ్‌పేట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా నాదర్‌గుల్‌కు చెందిన చెరుకుపల్లి వెంకట్‌రెడ్డి(ఓసీ), మీర్‌పేట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా మీర్‌పేట్‌కు చెందిన పెండ్యాల నర్సింహ(బీసీ) వ్యవహరించారు.
ఈ వార్తను కూడా చదవండి: Chinese manja: చైనా మాంజాపై టాస్క్‌ఫోర్స్ స్పెషల్ డ్రైవ్
కొత్త అధ్యక్షులు వీరే..
రెండుగా విభజించిన బడంగ్‌పేట్, మీర్‌పేట్ కార్పొరేషన్లకు నూతన అధ్యక్షులను పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి(Bokka Narasimha Reddy) ఆదివారం ప్రకటించారు. బడంగ్‌పేట్-1 అధ్యక్షుడిగా బడంగ్‌పేట్‌కు చెందిన రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి(ఓసీ), బడంగ్‌పేట్-2 అధ్యక్షుడిగా అల్మా్‌సగూడకు చెందిన రామిడి వీరకర్ణారెడ్డి(ఓసీ) నియమితులయ్యారు. ఇక మీర్‌పేట్-1 అధ్యక్షుడిగా మీర్‌పేట్‌కు చెందిన పసునూరి భిక్షపతిచారి(బీసీ), మీర్‌పేట్-2 అధ్యక్షుడిగా జిల్లెలగూడకు చెందిన తులసి ముఖేశ్‌ముదిరాజ(బీసీ) నియమితులయ్యారు. బడంగ్‌పేట్ ఇద్దరు అధ్యక్షులు ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, మీర్‌పేట్ ఇద్దరు అధ్యక్షులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం ఇక్కడ గమనార్హం!
బడంగ్‌పేట్ అధ్యక్షులకు సన్మానం
బడంగ్‌పేట్-1,2 అధ్యక్షులుగా నియమితులైన రామకృష్ణారెడ్డి, వీరకర్ణారెడ్డితో పాటు జిల్లా కౌన్సిల్ సభ్యులుగా నియమితులైన బాలాపూర్‌కు చెందిన జోరల ప్రభాకర్, అల్మా్‌సగూడ వినాయకహిల్స్‌కు చెందిన జి.శివారెడ్డిని సోమవారం నాదర్‌గుల్‌లోని పార్టీ కార్యాలయంలో తాజా మాజీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మీర్‌పేట్ అధ్యక్షులకు సన్మానం
మీర్‌పేట్-1,2 అధ్యక్షులుగా నియమితులైన భిక్షపతిచారి, ముఖేశ్‌ముదిరాజ్‌లను ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలనీలోని కార్పొరేటర్ యెడ్ల మల్లేశ్‌ముదిరాజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు కొలన్ శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొని ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.
ఈవార్తను కూడా చదవండి: గాలిపటం ఎగురవేస్తూ విద్యుదాఘాతంతో బాలుడి మృతి
ఈవార్తను కూడా చదవండి: పండుగ నాడు... పోషక శోభ
ఈవార్తను కూడా చదవండి: MLC K Kavitha: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత
ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..
Read Latest Telangana News and National News