Share News

Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సీబీఐ సోదాలు

ABN , Publish Date - Jan 04 , 2025 | 04:09 AM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సీబీఐ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. కస్టమ్స్‌ క్లియరెన్స్‌ కోసం విదేశీ ప్రయాణికుల నుంచి లంచం డిమాండ్‌ చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపఽథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది.

Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సీబీఐ సోదాలు

  • ఇద్దరు కస్టమ్స్‌ ఇన్‌స్పెక్టర్లు, బ్యాంకు ఉద్యోగి అరెస్టు

  • ‘క్లియరెన్స్‌’ కోసం లంచం తీసుకుంటుండగా పట్టివేత

హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సీబీఐ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. కస్టమ్స్‌ క్లియరెన్స్‌ కోసం విదేశీ ప్రయాణికుల నుంచి లంచం డిమాండ్‌ చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపఽథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది. జెడ్డా నుంచి వచ్చిన ఒక కుటుంబానికి కస్టమ్స్‌ క్లియరెన్స్‌ ఇవ్వడం కోసం కస్టమ్స్‌, సెంట్రల్‌ ఎక్సైజ్‌ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు రూ.50వేలు డిమాండ్‌ చేశారు. ఆ డబ్బును అక్కడే ఉన్న కెనరా బ్యాంకు ఉద్యోగి ద్వారా ఇద్దరు అధికారులు తీసుకుంటుండగా సీబీఐ పట్టుకుంది. మొత్తం ముగ్గురిని అరెస్టు చేశారు. అనంతరం పట్టుబడిన అధికారుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించి రూ.4.76లక్షలు స్వాధీనం చేసుకున్నామని సీబీఐ హైదరాబాద్‌ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Jan 04 , 2025 | 04:09 AM