Chinese manja: నిషేధమున్నా జోరుగా విక్రయాలు..
ABN , Publish Date - Jan 16 , 2025 | 08:59 AM
నిషేధమున్నా మహానగరంలో చైనా మాంజా(Chinese manja) క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. నామ్ కే వాస్తేగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు పూర్తిస్థాయిలో మాంజా అందుబాటులో లేకుండా చేయడంలో విఫలమయ్యారు. దీంతో పలు కుటుంబాల్లో పండగ సంతోషం కరువైంది.
- నియంత్రణలో పోలీసుల విఫలం
- చైనా మాంజా మెడకు చుట్టుకొని ఇద్దరికి గాయాలు
- పలు ప్రాంతాల్లో పక్షుల మృతి
హైదరాబాద్ సిటీ: నిషేధమున్నా మహానగరంలో చైనా మాంజా(Chinese manja) క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. నామ్ కే వాస్తేగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు పూర్తిస్థాయిలో మాంజా అందుబాటులో లేకుండా చేయడంలో విఫలమయ్యారు. దీంతో పలు కుటుంబాల్లో పండగ సంతోషం కరువైంది. చైనా మాంజా వినియోగంతో వాహనదారులు గాయపడ్డారు. పతంగులు ఎగరేసిన చిన్న పిల్లల చేతి వేళ్లకూ గాయాలయ్యాయి. పలు ప్రాంతాల్లో పావురాలు, ఇతరత్రా పక్షులూ మృతి చెందాయి. నారాయణగూడ(Narayanaguda) వంతెనపై పడి ఉన్న మాంజా చుట్టుకొని ట్రాఫిక్ కానిస్టేబుల్ శివరాజ్ మెడ కోసుకుపోయింది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) మెట్రో స్టేషన్ వద్ద మాంజా తగిలి ఐటీ ఉద్యోగి సాయివర్ధన్‌రెడ్డి మెడకు గాయమైంది. కేబీఆర్ పార్కు, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో మాంజావల్ల పావురాలు ప్రాణాలు కోల్పోయాయి. కొన్ని పక్షులూ గాయపడ్డాయి. గత ఏడాది లంగర్‌హౌస్ వంతెనపై నుంచి వెళ్తోన్న ఆర్మీ ఉద్యోగి మెడకు మాంజా చుట్టుకొని కోసుకుపోవడంతో మృతి చెందాడు. ఆయన ఫొటోతో సైనికుడి ప్రాణం తీసినా చైనా మాంజా.. అమ్మినా.. వినియోగించినా నేరమే.. ప్రజలు, పక్షుల ప్రాణాలకు ముప్పు ఉంది వాడొద్దంటు పోలీసులు ప్రచారం చేశారు. ఆ స్థాయిలో నిఘా ఉంచడంలో మాత్రం విఫలమయ్యారు.
ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకొని..
గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో చైనా మాంజా విరివిగా అందుబాటులో ఉంది. కొందరు ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకొని ఇంటి వద్దకు మాంజా సరఫరా చేశారు. మంగళ్‌హాట్, పురానాపూల్, ధూల్‌పేట, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో చైనా మాంజాను ఎక్కువగా విక్రయించారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ రహస్యంగా అమ్మారు. నిషేధం నేపథ్యంలో గతంతో పోలిస్తే మాంజా ధర భారీగా పెరిగింది. చిన్న బాబిన్ రూ. 600లకు పైగా.. పెద్దవి రూ.1200-1500లకుపైగా విక్రయించారు.
చైనా మాంజా కొని ఇంటికి తీసుకువచ్చేందుకు కొందరు అక్రమ రవాణాదారుల తరహాలో జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని దుకాణాల్లో సాధారణ మాంజా కనిపించేలా ఉంచి.. రెగ్యులర్ కస్టమర్లకు చైనా మాంజా గుట్టుగా విక్రయించారు. సంక్రాంతికి ముందు పలు దుకాణాల్లో దాడులు నిర్వహించిన పోలీసులు రూ.90 లక్షల విలువైన 7,334 చైనా మాంజా బాబిన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాస్తవంగా సాగిన విక్రయాలతో పోలిస్తే ఇది అత్యల్పం.
ఈవార్తను కూడా చదవండి: యువతిని రక్షించబోయి హత్యకు గురయ్యాడా?!
ఈవార్తను కూడా చదవండి: KTR: అరెస్టు చేస్తారా?
ఈవార్తను కూడా చదవండి: పుప్పాలగూడలో జంట హత్యల కలకలం
ఈవార్తను కూడా చదవండి: పవర్‌ప్లాంటు స్ర్కాప్ కుంభకోణంపై నీలినీడలు !
Read Latest Telangana News and National News