R. Krishnaiah: బీసీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి
ABN , Publish Date - Jan 14 , 2025 | 09:05 AM
బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) డిమాండ్ చేశారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లను పొందుతున్న ఏ వర్గానికి విధించని క్రీమి లేయర్‌ను బీసీలకే విధించడం ఏమిటని.. దీన్ని తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
- ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) డిమాండ్ చేశారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లను పొందుతున్న ఏ వర్గానికి విధించని క్రీమి లేయర్‌ను బీసీలకే విధించడం ఏమిటని.. దీన్ని తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాచిగూడ అభినందన గ్రాండ్ హోటల్(Grand Hotel)లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాముని సుదర్శన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆర్. కృష్ణయ్య(R. Krishnaiah) పాల్గొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: BJP: బడంగ్‌పేట్, మీర్‌పేట్ బీజేపీ అధ్యక్షుల నియామకం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బలమైన బీసీ ఉద్యమం చేపడితే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి పలు పథకాలను ప్రవేశపెడుతుందని సూచించారు. రిజర్వేషన్లు పెట్టింది పేదరిక నిర్మూలన కోసం కాదని సామాజిక అభివృద్ధి కోసమేనని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు, బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: గాలిపటం ఎగురవేస్తూ విద్యుదాఘాతంతో బాలుడి మృతి
ఈవార్తను కూడా చదవండి: పండుగ నాడు... పోషక శోభ
ఈవార్తను కూడా చదవండి: MLC K Kavitha: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత
ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..
Read Latest Telangana News and National News