Share News

Flight Prices: ప్రయాణికులకు షాక్.. హైదరాబాద్ టూ విశాఖపట్నం టిక్కెట్ ధర రూ. 35 వేలు..

ABN , Publish Date - Jan 11 , 2025 | 09:02 PM

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ సీజన్ వచ్చిందంటే చాలు. అనేక మంది నగరాల నుంచి వారి ఊళ్లకు వెళ్లేందుకు పలు రకాలుగా ప్రయాణాలు చేస్తుంటారు. అయితే ఇదే సమయంలో పలువురు ప్రయాణికులు మాత్రం రూ. 35 వేల టిక్కెట్ ధరలు చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Flight Prices: ప్రయాణికులకు షాక్.. హైదరాబాద్ టూ విశాఖపట్నం టిక్కెట్ ధర రూ. 35 వేలు..
HyderabadToVisakhapatnam

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పండుగ సంక్రాంతి. అయితే ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని ఆశిస్తారు. పండుగకు ముందే చాలామంది తమ పల్లెలకు, వారి స్వగ్రామాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. కానీ ఈసారి సంక్రాంతి పండుగ సమయంలో హైదరాబాద్ (Hyderabad) నుంచి ప్రయాణం చేసే పలువురికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ట్రైన్లతోపాటు బస్సులు కూడా కిటకిటలాడుతున్నాయి. అనేక మంది ఈరోజే వెళ్లడంతో హైవేలతోపాటు ట్రైన్లు కూడా ప్రయాణికులతో రద్దీ రద్దీగా కనిపిస్తున్నాయి.


ఈ ప్రయాణంలో మాత్రం...

అయితే ఇదే సమయంలో ఫ్లైట్ ప్రయాణంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం (Hyderabad To Visakhapatnam) వెళదామని చూస్తే టిక్కెట్ రేట్లు (Flight Prices) చూసిన ప్రయాణికులు షాక్ అవుతున్నారు. ఎందుకంటే నాన్ స్టాప్ ఫ్లైట్ రేట్లు రూ.17,500 ఉండగా, ఒక స్టాప్ విమాన ప్రయాణంలో ధరలు రూ. 27,188గా ఉన్నాయి. మరో విమాన ప్రయాణంలో రేటు రూ.35,000 ఉన్నట్లు మేక్ మై ట్రిప్ వెబ్‌సైట్లో చూపిస్తున్నాయి. అయితే ఈ రేట్లు మాత్రం జనవరి 11, జనవరి 12వ తేదీలలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత రోజుల్లో జనవరి 13న రూ. 5741గా ఉన్నాయి. ఇది చూసిన పలువురు ప్రయాణికులు ఆశ్చర్యపోతున్నారు.

hyd to visakapatnam.JPG


ప్రయాణికుల ఆవేదన..

ఇంతవరకు ఇంత భారీ టెక్కెట్ ధరలు ఎప్పుడూ చూడలేదని ప్రయాణికులు అంటున్నారు. నిత్యం రూ.4,000 వేల నుంచి 7,000 మధ్య ఉండే ధరలు ఇప్పుడు భారీగా పెరిగాయని అంటున్నారు. పండుగ సీజన్ ప్రారంభం అయిపోతే ఒక్కసారిగా రూ.35,000 దాటిపోవడం ఎంటని ప్రశ్నిస్తున్నారు. విమానయాన సంస్థలు పండుగ సీజన్‌లో తమ సర్వీసులపై ఎక్కువ ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుని విమానాల టెక్కెట్ ధరలను పెంచాయాని చెబుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు పెద్ద సంఖ్యలో ప్రయాణం చేయాల్సిన వారు ఉంటారు. దీనికి తోడు ఈ సంవత్సరం డిమాండ్ భారీగా పెరిగింది. అందువల్ల, టిక్కెట్ ధరలు కూడా రెట్టింపు అయ్యాయి.

HyderabadToVisakhapatnam2.JPG


నియంత్రణ చేయాలని..

కొంతమంది ప్రయాణికులు ఈ ధరల పెరుగుదలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విమానయాన సంస్థలు ఈ ధరలను నిర్దేశించడంలో ఒప్పందాలను వ్యతిరేకంగా అమలు చేస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ధరలను పరిమితికి మించి పెంచారని మరికొంత మంది ప్రయాణికులు అంటున్నారు. ప్రైవేట్ విమాన సంస్థలు ప్రయాణికుల డిమాండ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ధరలు భారీగా పెంచి మరింత ఆదాయాన్ని పొందే దిశగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఈ ధరల పెరుగుదలపై ప్రభుత్వాలు కూడా పరిశీలన చేయాలని కోరుతున్నారు. పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ధరల పెరుగుదలపై నియంత్రణలు అమలు చేయాలని కోరుతున్నారు.


ఇవి కూడా చదవండి...

Tata Tiago: రూ. 7 లక్షలకే.. టాటా ఎలక్ట్రిక్ కార్...


Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ

TG News: గేదెలు కాసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్

CM Revanth: సీఎం రేవంత్ జిల్లాల బాట.. వాటిపై ప్రత్యేక దృష్టి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 11 , 2025 | 09:16 PM