Share News

GHMC: దుకాణాల ఎదుట చెత్త డబ్బా లేకపోతే జరిమానా..

ABN , Publish Date - Jan 09 , 2025 | 10:24 AM

దుకాణాల ఎదుట డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేయకుండా రోడ్లపై చెత్త వేసే వ్యాపారులను గుర్తించి జరిమానా విధించాలని జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌(పారిశుధ్యం)రఘుప్రసాద్‌(Raghu Prasad) అధికారులను ఆదేశించారు.

GHMC: దుకాణాల ఎదుట చెత్త డబ్బా లేకపోతే జరిమానా..

హైదరాబాద్‌ సిటీ: దుకాణాల ఎదుట డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేయకుండా రోడ్లపై చెత్త వేసే వ్యాపారులను గుర్తించి జరిమానా విధించాలని జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌(పారిశుధ్యం)రఘుప్రసాద్‌(Raghu Prasad) అధికారులను ఆదేశించారు. సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో పారిశుధ్య నిర్వహణపై సహాయ వైద్యాధికారులు(ఏఎంఓహెచ్‌), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (డీఈఈ)లతో అదనపు కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డితో కలిసి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ వార్తను కూడా చదవండి: KTR: రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్


city5.2.jpg

హైదరాబాద్‌ను స్వచ్ఛమైన నగరంగా రూపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. కాలనీలు, బస్తీలు, ప్రధాన రహదారుల్లో శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వాణిజ్య సముదాయాలుండే ప్రాంతాలను నిత్యం తనిఖీ చేయాలని, రోడ్లపై చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. భవన నిర్మాణరంగ వ్యర్థాలు రోడ్లపై వేయకుండా చూడాలని, రీ సైక్లింగ్‌ ప్లాంట్‌లనూ సందర్శించాలని సూచించారు.


ఈవార్తను కూడా చదవండి: హైడ్రాకు ఫిర్యాదులపై రంగంలోకి రంగనాథ్‌

ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై కేసు పెడితే రౌడీళ్లా ప్రవర్తిస్తున్నారు

ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ సీఎం కావడానికి కారణమిదే.. సంచలన విషయాలు బయటపెట్టిన హరీష్‌రావు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 09 , 2025 | 10:24 AM