Husband Kills Wife: భార్యను ముక్కలు ముక్కలుగా నరికి, ఉడకబెట్టి..
ABN , Publish Date - Jan 22 , 2025 | 09:33 PM
నగరంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చెరువులో పడేశాడు. రాచకొండ కమిషనరేట్ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడలో చోటు చేసుకున్న ఈ ఘటన నగరంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చెరువులో పడేశాడు. రాచకొండ కమిషనరేట్ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడలో చోటు చేసుకున్న ఈ ఘటన..

హైదరాబాద్, జనవరి 22: నగరంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చెరువులో పడేశాడు. రాచకొండ కమిషనరేట్ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ భయానక ఘటన తాలూకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి మాజీ ఆర్మీ ఉద్యోగి. డీఆర్‌డీఓలో ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. జిల్లెలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో తన భార్య వెంకట మాధవి(35)తో నివాసముంటున్నాడు. అయితే, ఈ నెల 13వ తేదీన మాధవి మిస్సింగ్ అయినట్లు ఆమె తల్లితండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు సమయంలో తనకు ఏమీ తెలియదన్నట్లుగా అత్తమామలతో కలిసి మీర్‌పేట పీఎస్‌కు వచ్చాడు మాధవి భర్త. అయితే, పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా.. అసలు విషయం వెలుగు చూసింది.
మాధవిని భర్త గురుమూర్తే చంపినట్లు తేలింది. తన భార్యపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి.. ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాడు. అంతేకాదు.. సాక్ష్యాధారాలు లభించొద్దనే ఉద్దేశంతో.. మరింత క్రూరంగా ప్రవర్తించాడు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి.. ఆమె శరీర భాగాలను కుక్కర్‌లో ఉడకబెట్టాడు. ఆపై వాటిని ఎండపెట్టి.. కాల్చి బూడిద చేశాడు. ఆ బూడిన ఒక బకెట్‌లో తీసుకెళ్లి.. చెరువులో పడేశాడు. సంక్రాంతి పండుగ మూడు రోజులు ఇదే పని చేశాడని పోలీసులు తెలిపారు. అయితే, మృతదేహానికి సంబంధించి ఆనవాళ్ల కోసం పోలీసులు చెరువును జల్లెడ పడుతున్నారు. బుడిద కావడంతో ఎలాంటి ఆనవాళ్లు లభించడం లేదు. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
వాటే క్యాచ్.. ఇదీ తెలుగోడి దెబ్బ
హవ్వా.. నడిరోడ్డు మీద ఈ పనేంటి?
For More Telangana News and Telugu News..