Hyderabad: ఆ భవనాలకు రెట్టింపు బాదుడు..
ABN , Publish Date - Jan 02 , 2025 | 08:08 AM
ఇంకుడుగుంతను డిసెంబరు 31వ తేదీ వరకు నిర్మించుకోవాలంటూ వాటర్‌బోర్డు(Waterboard) కొందరు వినియోగదారులకు నోటీసులు జారీ చేయగా.. అందులో కొందరే స్పందించగా మిగతావారు ఉలుకు.. పలుకు లేదు.
- నోటీసులందినా.. ఇంకుడుగుంత నిర్మించలేదు
- నిర్మాణం చేసే వరకు నీటి ట్యాంకర్ బుకింగ్ చేస్తే డబుల్ చార్జీ
- అమల్లోకి తీసుకొచ్చిన వాటర్‌బోర్డు
హైదరాబాద్ సిటీ: ఇంకుడుగుంతను డిసెంబరు 31వ తేదీ వరకు నిర్మించుకోవాలంటూ వాటర్‌బోర్డు(Waterboard) కొందరు వినియోగదారులకు నోటీసులు జారీ చేయగా.. అందులో కొందరే స్పందించగా మిగతావారు ఉలుకు.. పలుకు లేదు. నోటీసుఅందినా ఇంకుడు గుంతను నిర్మించుకొని భవన యజమానులు ట్యాంకర్ బుకింగ్ చేస్తే రెట్టింపు చార్జీ విధించేందుకు వాటర్‌బోర్డు చర్యలు చేపట్టింది.
ఈ వార్తను కూడా చదవండి: Minister: ఔషధ నియంత్రణ వ్యవస్థ మరింత బలోపేతం
వర్షాభావ పరిస్థితులతో గతేడాది వేసవిలో నగరంలో భూగర్భ జలాలు అడుగంటాయి. వాటర్‌బోర్డు సరఫరా చేసే నీరే ఆధారమవ్వడంతో విపరీతమైన ట్యాంకర్ల డిమాండ్ ఏర్పడింది. వాటర్‌బోర్డు పరిధిలో 24 డివిజన్లు ఉండగా హఫీజ్‌పేట, శేరిలింగంపల్లి (డివిజన్-15), ఎస్.ఆర్.నగర్ (డివిజన్-6), కూకట్‌పల్లి (డివిజన్-9), మణికొండ (డివిజన్-18), నిజాంపేట్ (డివిజన్-23)లోని 20 సెక్షన్ల పరిధిలోనే పెద్ద సంఖ్యలో ట్యాంకర్లు బుకింగ్ జరిగాయి. దీంతో బుకింగ్ చేశాక నాలుగైదు రోజుల వరకు ట్యాంకర్ అందని పరిస్థితి నెలకొన్నది. అయితే, గత వేసవిలో రెండు నెలల కాలంలోనే ఓ వంద కుటుంబాలు 31వేల ట్రిప్పులను బుకింగ్ చేయడం గమనార్హం.
22వేల ఇళ్ల ప్రాంగణాల్లో ఇంకుడు గుంతలు లేవు..
గతేడాది ఏర్పడిన ట్యాంకర్ల డిమాండ్ నేపథ్యంలో నగరంలో 18 ఎన్జీఓల ప్రతినిధులను రంగంలోకి దించి ట్యాంకర్లను బుకింగ్ చేసుకున్నవారి వివరాలను సేకరించారు. వారికి ఇంకుడు గుంతలున్నాయా? లేవా? సర్వే చేశారు. ఆ వివరాల్ని ప్రత్యేక యాప్‌లో పొందుపర్చారు. గతేడాది వేసవిలో 40వేల కుటుంబాలు 70శాతం ట్యాంకర్లను బుకింగ్ చేయగా.. వారి ప్రాంగణాల్లో సర్వే చేశారు.
అందులో 18 వేల కుటుంబాలు మాత్రమే ఇంకుడు గుంతల నిర్మాణాలు కలిగి ఉన్నాయి. మిగిలిన 22వేల కుటుంబాల ప్రాంగణాల్లో ఇంకుడు గుంతలు లేవు. అయితే వాల్టా చట్టం-2022 ప్రకారం.. 300 చదరపు మీటర్లు అంతకంటే ఎక్కువగా ఉన్న స్థలంలో ఉండే భవనాలు ఇంకుడుగుంత నిర్మించుకునేవిధంగా వాటర్‌బోర్డు చర్యలు చేపట్టింది. 22వేల కుటుంబాలు డిసెంబర్ 31వ తేదీ వరకు ఇంకుడు గుంత నిర్మించుకోవాలని వాటర్‌బోర్డు నోటీసులు జారీ చేసింది.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad Metro: మేడ్చల్.. శామీర్‌పేటకు మెట్రో!
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసాపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన
ఈవార్తను కూడా చదవండి: పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు
ఈవార్తను కూడా చదవండి: తాటిబెల్లం తింటే...
Read Latest Telangana News and National News