Hyderabad: 21వ శతాబ్దం డిజిటల్ టెక్నాలజీదే..
ABN , Publish Date - Jan 05 , 2025 | 11:28 AM
డిజిటల్ టెక్నాలజీ(Digital technology)కి 21వ శతాబ్దం కేంద్ర బిందువుగా మారనున్నదని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. ఒక్కొక్క శతాబ్దం ఒక్కొక్క రంగానికి మూలబిందువుగా కొనసాగిందని, ఈ శతాబ్దిలో డిజిటల్ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
- స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో ఉన్నతమైన ఉద్యోగావకాశాలు
- అన్ని యూనివర్సిటీల్లో స్కిల్ డెవల్‌పమెంట్ కోర్సులు
- తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి
హైదరాబాద్: డిజిటల్ టెక్నాలజీ(Digital technology)కి 21వ శతాబ్దం కేంద్ర బిందువుగా మారనున్నదని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. ఒక్కొక్క శతాబ్దం ఒక్కొక్క రంగానికి మూలబిందువుగా కొనసాగిందని, ఈ శతాబ్దిలో డిజిటల్ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. శనివారం అవంతి గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో కాచిగూడ(Kachiguda) మున్నూరుకాపు భవన్‌లో ప్రజ్ఞా - 2కే 25 పేరుతో డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ జాతీయ సదస్సు నిర్వహించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: స్నేహం నటించి.. డబ్బు కొల్లగొట్టి.. మొత్తం 48.38 లక్షలు గోవిందా..
ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ స్కిల్ యూనివర్సిటీ ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో స్కిల్ డెవల్‌పమెంట్ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి, అవంతి విద్యా సంస్థల చైర్మన్ ఎం.శ్రీనివాస్‌రావు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మాజీ డీన్ ఎం.రామ్మోహన్‌రావు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ డైరెక్టర్ ప్రొ. ఎస్. శ్రీనివాసమూర్తి, బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధి బీకే.వసంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: ‘తెలుగు‘లో చదివితే ఉద్యోగాలు రావన్నది అపోహే
ఈవార్తను కూడా చదవండి: KTR: కేంద్రంలో చక్రం తిప్పుతాం
ఈవార్తను కూడా చదవండి: DK Aruna: చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగాలి
ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం అభివృద్ధిపై మంత్రి తుమ్మల కీలక నిర్ణయాలు
Read Latest Telangana News and National News