Share News

TG News: రాచకొండ కమిషనరేట్‌‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎన్నో తెలుసా

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:14 AM

Telangana: రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న (డిసెంబర్ 31) 10 గంటల నుంచి ఈరోజు ఉదయం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు పోలీసులు. మందు సేవించి వాహనం నడిపిన అనేక మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

TG News: రాచకొండ కమిషనరేట్‌‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎన్నో తెలుసా
Drunk and drive cases

హైదరాబాద్, జనవరి 1: దేశ వ్యాప్తంగా న్యూఇయర్ సంబరాలు అంబరాన్ని అంటాయి. న్యూఇయర్ సందర్భంగా యువత ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. కొంతమంది ఆడుతూ పాడుతూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పగా.. మరికొందరు మాత్రం మందు సేవించి హల్‌చల్ చేశారు. న్యూఇయర్ వేడుకల్లో నో ఆల్కహాల్ అంటూ పోలీసులు చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. పీకలదాకా తాగుతూ రోడ్లపై తిరుగుతూ న్యూఇయర్ వేడుకలను జరుపుకున్నారు. అయితే మందుబాబులకు మాత్రం పోలీసులు గట్టి షాకే ఇచ్చారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తాగి వాహనాలు నడిపిన వారి పనిపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి మందు సేవించిన వారిని పట్టుకున్నారు. వారిపై కేసులు కూడా నమోదు చేశారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి.


పెద్ద సంఖ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు పోలీసులు. నిన్న (డిసెంబర్ 31) 10 గంటల నుంచి ఈరోజు ఉదయం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు పోలీసులు. మందు సేవించి వాహనం నడిపిన అనేక మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాగి వాహనాలు నడుపుతున్నట్లు అనుమానం వచ్చిన వెంటనే పోలీసులు వారిని ఆపై మరీ బ్రీత్ ఎనలైజర్ టెస్టులు నిర్వహించారు. రాత్రి మొత్తం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రై‌వ్‌ తనిఖీల్లో మద్యం సేవించిన అనేక మంది పోలీసులకు చిక్కారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ పరిధిలో దాదాపు 619 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. మల్కాజ్‌గిరి డివిజన్‌లో 230 కేసులు నమోదు కాగా భువనగిరి డివిజన్లో 84 కేసులు నమోదయ్యాయి. అలాగే ఎల్బీనగర్లో 232 కేసులు నమోదు అవగా.. మహేశ్వరంలో 47 కేసులు నమోదయ్యాయి.

కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో 4.9 కిలోల గంజాయి పట్టివేత


మరోవైపు పంజాగుట్టలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన పోలీసులు పెద్ద షాకే తగిలింది. వెంగల్‌రావు పార్క్ వద్ద మద్యం సేవించి వెళుతుండగా ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. సదరు వ్యక్తికి బ్రీత్ ఎన్‌లైజర్ టెస్ట్ నిర్వహించగా.. అందులో వచ్చిన సంఖ్య చూసి పోలీసులు అవాక్కయ్యారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌‌లో 550 రీడింగ్ నమోదు అయ్యింది. 550 ఆల్కహాల్ రీడింగ్ రావడంతో ఆశ్చపోవడం పోలీసుల వంతైంది. వెంటనే ఆ వ్యక్తిపై కాప్స్ కేసు నమోదు చేశారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికి 550 పాయింట్స్ వచ్చిన ఆ వ్యక్తి మాత్రం.. తాను రేవంత్ అన్న తాలూకా అంటూ పోలీసుల ఎదుట బుకాయింపుకు దిగాడు.


ఇవి కూడా చదవండి...

Secunderabad: కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో 4.9 కిలోల గంజాయి పట్టివేత

న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 01 , 2025 | 11:32 AM