Crime News: అకౌంటెంట్‌పై యాసిడ్ దాడి కేసు.. పోలీసుల అదుపులో నిందితులు..
ABN , Publish Date - Mar 16 , 2025 | 02:09 PM
హోలీ పండగ రోజున హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సైదాబాద్ భూలక్ష్మీ మాతా ఆలయం అకౌంటెంట్ నర్సింగ్ రావుపై యాసిడ్ దాడి జరిగింది. 'హ్యాపీ హోలీ' అంటూ దుండగుడు అకౌంటెంట్ తలపై యాసిడ్ దాడి చేశాడు. దీంతో అకౌంటెంట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: హోలీ (Holi) పండగ రోజున హైదరాబాద్ (Hyderabad) నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సైదాబాద్ భూలక్ష్మీ మాతా ఆలయం అకౌంటెంట్ (Accountant) నర్సింగ్ రావు (Narsing Rao)పై యాసిడ్ దాడి (Acid Attack) జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోపలికి వచ్చి 'హ్యాపీ హోలీ' అంటూ అకౌంటెంట్ తలపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అకౌంటెంట్ నర్సింగ్ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు (Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ మీడియా సమావేశం..
ఈ కేసుకు సంబంధించి సౌత్ ఈస్ట్ డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ (DCP Patil Kantilal Subhash) ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 14 వ తేదీన భూ లక్ష్మీ ఆలయంలో అకౌంటెంట్ నర్సింగ్ రావుపై యాసిడ్ దాడి జరిగిందని, ఆయన గుడిలో కూర్చుని ఉండగా గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడన్నారు. ముసుగు ధరించిన వ్యక్తి నర్సింగ్ రావు వద్దకు వచ్చి తాను నరేష్‌గా పరిచయం చేసుకున్నాడని.. అన్నదానం గురించి నర్సింగ్ రావు వద్ద నిందితుడు సమాచారం అడిగాడని.. అదే సమయంలో అకస్మాత్తుగా నర్సింగరావు తలపై ‘హోలీ శుభాకాంక్షలు’ అంటూ యాసిడ్ దాడి చేసి పారిపోయాడని తెలిపారు. దీంతో బాదితుడిని మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారన్నారు.
Also Read..:
మాజీమంత్రి హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు..
నిందితుడు రాయికోడ్ హరిపుత్ర..
బాధితుడు నర్సింగ్ రావు పిర్యాదు మేరకు ఆరు పోలీస్ టీమ్‌లను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టామని డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ తెలిపారు. ఆరు బృందాలు 400 సీసీటీవీ ఫుటేజీలను సమీక్షించారని, వాటిని పరిశీలించగా.. నేరం చేసిన తర్వాత నిందితుడు ద్విచక్ర వాహనంపై పారిపోయినట్లు గుర్తించామన్నారు. యాసిడ్ దాడి చేసిన నిందితుడిని రాయికోడ్ హరిపుత్రగా గుర్తించామని, గాంధీభవన్ మెట్రో స్టేషన్‌లో నేరం చేయడానికి హత్రిపుత్ర టోపీ కొనుగోలు చేశాడని, టోపీ కొనుగోలు చేయడం కోసం నిందితుడు ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించాడని అన్నారు. ఆ ట్రాన్సాక్షన్ ద్వారా నిందితుడి ఫోన్ నెంబర్ సేకరించామని.. తద్వారా నిందితుడు హరిపుత్రను షేక్‌పేటలోని అతని నివాసంలో అరెస్ట్ చేశామన్నారు.
భూలక్ష్మి ఆలయంలో పనిచేసే పూజారి రాజశేఖర్ శర్మ ఆదేశాల మేరకు తాను యాసిడ్ దాడి చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడని, దీంతో రాజశేఖర శర్మను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ తెలిపారు. యాసిడ్ దాడి చేయడానికి హరిపుత్రతో రాజశేఖర్ శర్మ 2 వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడన్నారు. రాజశేఖర్ శర్మ నర్సింగరావుపై దాడి చేయడానికి వివిధ కారణాలు చెప్పాడన్నారు. నర్సింగరావు ఆలయంలో రిసిప్ట్ ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని అందుకే దాడి అంటూ ఓసారి... గుడికి వచ్చే పిల్లలను దూషిస్తున్నాడని మరోసారి.. దాడికి వివిధ కారణాలను రాజశేఖర్ శర్మ చెబుతున్నాడని డీసీపీ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతిపై సీఎం చంద్రబాబు దృఢ సంకల్పం..
టీడీపీ తరపున ఏజెంట్‌గా కూర్చుంటే హత్యలు చేస్తారా..
ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
For More AP News and Telugu News