Share News

Shekhar Basha: ఆర్జే శేఖర్‌ బాషాపై మరో కేసు..

ABN , Publish Date - Feb 06 , 2025 | 01:44 PM

Shekhar Basha: బిగ్‌బాస్ ఫేమ్, ఆర్జే శేఖర్‌పై మరో కేసు నమోదు అయ్యింది. కొరియోగ్రాఫర్ షష్టి వర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు శేఖర్‌పై కేసు నమోదు చేశారు. ఖర్ బాషా వ్యక్తిగత మొబైల్‌తో పాటు, అతనితో ఉన్న ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్‌లు సీజ్ చేయాలని బాధితురాలు కోరింది.

Shekhar Basha: ఆర్జే శేఖర్‌ బాషాపై మరో కేసు..
case registered against RJ Shekhar Basha

హైదరాబాద్, ఫిబ్రవరి 6: నగ్న వీడియోలు, డ్రగ్స్‌ పార్టీలతో మస్తాన్ సాయి కేసు (Mastan Sai Case) రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్‌ సాయి అరెస్ట్‌ అయి జ్యూడిషియల్ రిమాండ్‌కు వెళ్లారు. అలాగే బిగ్ బాస్ ఫేమ్,ఆర్జే శేఖర్‌ భాషాపై(RJ Shekhar Basha) కూడా లావణ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. శేఖర్ బాషాపై నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదు అయ్యింది. శేఖర్ బాషాపై కొరియోగ్రాఫర్ షష్టి వర్మ ఫిర్యాదు చేశారు.


కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై షష్టి వర్మ గతంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ కేసులో విచారణ జరుగుతుండగా తన వ్యక్తిగత కాల్ రికార్డు లీక్ చేశాడని షష్టి వర్మ ఫిర్యాదులో పేర్కొంది. తన పరువుకు భంగం వాటిల్లేలా , కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లో మాట్లాడుతున్నాడని మహిళా కొరియోగ్రాఫర్ క్లంపైట్ చేశారు. ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంతో ప్రైవేటు కాల్ రికార్డ్‌లు లీక్ చేశాడని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. శేఖర్ బాషా వ్యక్తిగత మొబైల్‌తో పాటు, అతనితో ఉన్న ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్‌లు సీజ్ చేయాలని బాధితురాలు కోరింది. దీంతో శేఖర్ బాషాపై బీఎన్‌ఎస్‌ యాక్ట్ సెక్షన్ 79 ,67, ఐటీ యాక్ట్ 72 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయం..


మరోవైపు శేఖర్‌ బాషాపై లావణ్య ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు. లావణ్యను ఉద్దేశపూర్వకంగానే డ్రగ్స్‌ కేసులో ఇరికించాలని ఇటు మస్తాన్ సాయి, శేఖర్‌ బాషా ప్రయత్నం చేశారంటూ ఓ ఆడియో పోలీసులకు ఇవ్వడంతో శేఖర్‌ బాషాపై కేసు నమోదు అయ్యింది. ఈలోపే శేఖర్ బాషాపై మరో కేసు కూడా నమోదు చేశారు నార్సింగి పోలీసులు. కొరియోగ్రాఫర్ షష్టి వర్మ ఇచ్చిన ఫిర్యాదుతో శేఖర్ బాషాపై మరో ఎఫ్‌ఐఆర్‌ను పోలీసులు నమోదు చేశారు. ఆర్జే శేఖర్‌పై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓవైపు డ్రగ్స్ కేసు, నగ్న వీడియోల విచారణ కొనసాగుతున్న సమయంలో ఆ కేసులో శేఖర్ బాషాను నిందితుడిగా చేర్చారు. మరోవైపు షష్టి వర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్జే పేరు ఎఫ్‌ఐఆర్‌‌లో చేర్చారు. తనపై అత్యాచారం చేశారంటూ గతంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై షష్టి వర్మ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుగుతున్న సమయంలో జానీ మాస్టర్‌పై తాను మాట్లాడిన ప్రైవేటు కాల్స్‌ను శేఖర్‌ బాషా యూట్యూబ్‌ ఛానల్‌లో లీక్ చేశాడని, దీంతో తన పరువు భంగం కలిగేలా ప్రవర్తించాడని, చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఆర్కే శేఖర్‌ బాషాపై మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.


గతంలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో శేఖర్‌ బాషాపై ఓ కేసు నమోదు అయ్యింది. లక్ష్మీ పడాల్ అనే యువతి.. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ శేఖర్ బాషాపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో శేఖర్ బాషాపై ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు అయ్యాయి. ఈ మూడు కేసులకు సంబంధించి ఓ వైపు పోలీసులు విచారణను కొనసాగిస్తున్నాయి. అయితే లావణ్య కేసులో శేఖర్ బాషాను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

CLP Meeting: సీఎల్పీ మీటింగ్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ ఆహ్వానం

Mastan Sai: మస్తాన్ సాయిని కస్టడీకి కోరిన పోలీసులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 06 , 2025 | 01:46 PM