Share News

TG Politics: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు షాక్ ఇచ్చిన బీజేపీ.. అందరి కంటే ముందే..

ABN , Publish Date - Jan 10 , 2025 | 05:06 PM

తెలంగాణలో జరగబోయే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థి పార్టీలకు బీజేపీ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే.

TG Politics: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు షాక్ ఇచ్చిన బీజేపీ.. అందరి కంటే ముందే..
BJP

హైదరాబాద్: తెలంగాణ(Telangana)లో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections)కు బీజేపీ (BJP) అభ్యర్థులను ప్రకటించింది. అందరి కంటే ముందుగానే మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థి పార్టీలకు బీజేపీ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్- మెదక్ గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేరును బీజేపీ ఖరారు చేసింది. నిజామాబాద్​-అదిలాబాద్- కరీంనగర్- మెదక్-టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కోమరయ్య పేరును ప్రకటించింది.

BLN Reddy: ఏసీబీ విచారణలో బీఎల్ఎన్ రెడ్డి కీలక విషయాలు వెల్లడి..


అలాగే వరంగల్- ఖమ్మం-నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తం రెడ్డిని కాషాయం పార్టీ ప్రకటించింది. అన్ని ప్రధాన పార్టీల కంటే ముందే తమ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. ప్రచారంలోనూ దూకుడు పెంచేలా కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు సాధించడంతో ఎమ్మెల్సీ ఎన్నికలపైనా ప్రస్తుతం ఫోకస్ పెట్టింది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రజల దృష్టిని ఆకర్షించేలా చేస్తోంది. ఈ మూడు స్థానాలను సైతం కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

TG Highcourt: ఆ షోలు రద్దు చేశామంటూ మళ్లీ ఏంటిది.. హైకోర్టు అసంతృప్తి

TG News: షాకింగ్ న్యూస్.. పది అడుగుల లోతులో పడ్డ భారీ ట్రక్

Updated Date - Jan 10 , 2025 | 05:17 PM