Share News

Explosion: కుషాయిగూడ పారిశ్రామికవాడలో పేలుడు

ABN , Publish Date - Mar 23 , 2025 | 10:07 AM

ఈ మధ్య కాలంలో పారిశ్రామిక వాడల్లో పేలుడులు సంభవిస్తున్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లా, కుషాయిగూడ పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కార్మికుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Explosion: కుషాయిగూడ పారిశ్రామికవాడలో పేలుడు
Explosion in Medchal District

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా (Medchal District), కుషాయిగూడ (Kushaiguda) పారిశ్రామికవాడ (Industrial Estate)లో దారుణం జరిగింది. పారిశుద్ధ్య కార్మికుడు ట్రాక్టర్‌లో చెత్త వేస్తుండగా పేలుడు (Explosion) జరిగింది. భారీ శబ్ధంతో గుర్తు తెలియని వస్తువు పేలడంతో తీవ్రంగా గాయపడిన కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు (Worker Death). ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరుచుగా చోటు చేసుకుంటున్నాయి. పారిశ్రామిక వాడల్లో ఉపయోగించిన కెమికల్స్ డబ్బాలను చెత్తలో పడేస్తుంటారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా కుషాయిగూడ పారిశ్రామికవాడలో జరిగిన ఘటనలో కెమికల్ డబ్బా పేలి ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read..:

KTR: ఎక్కని గుడి లేదు.. మొక్కని దేవుడు లేడు..


యాసిడ్ ట్యాంకర్‌కు ప్రమాదం

మరోవైపు ఖమ్మం జిల్లాలో యాసిడ్ ట్యాంకర్‌కు ప్రమాదం జరగడంతో స్థానికులు ఆందోళన చెందారు. తల్లాడ మండలం, అంబేద్కర్ నగర్ సమీపంలో ప్రధాన రహదారిపై నిలిచిన వరికోత యంత్రాన్ని తప్పించబోయి యాసిడ్ ట్యాంకర్‌ను మరో ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ నుంచి హెచ్‌సీఎల్ యాసిడ్ లీక్ కావడంతో రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని యాసిడ్ లీక్‌ను అదుపు చేశారు.


సంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం..

సంగారెడ్డి జిల్లా, జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. సర్జికల్ స్టోర్ గదిలో షార్ట్ సర్క్యూట్‌తో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. సుమారు రూ. 20 లక్షల విలువైన మెడిసిన్ అగ్నికి ఆహుతయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని మండలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనాస్థలాన్ని ఆర్డీవో, ఎస్ఐ పరిశీలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం..

నాడు ఎన్టీఆర్‌పై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌

హైదరాబాద్‌లో డీలిమిటేషన్‌ సమావేశం..

For More AP News and Telugu News

Updated Date - Mar 23 , 2025 | 10:07 AM