Share News

Attack On Bollywood Actress: షాప్‌ ఓపెనింగ్‌కు వచ్చిన బాలీవుడ్ నటికి ఊహించని షాక్

ABN , Publish Date - Mar 24 , 2025 | 09:32 AM

Attack On Bollywood Actress: హైదరాబాద్‌లో బాలీవుడ్‌ నటికి ఊహించని ఘటన ఎదురైంది. షాప్ ఓపెనింగ్‌కు వచ్చిన ఆమె పట్ల కొందరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు సంచలనంగా మారింది.

Attack On Bollywood Actress: షాప్‌ ఓపెనింగ్‌కు వచ్చిన బాలీవుడ్ నటికి ఊహించని షాక్
Attack On Bollywood Actress

హైదరాబాద్, మార్చి 24: షాప్ ఓపెనింగ్‌కు వచ్చిన బాలీవుడ్ నటికి (Bollywood Actress) అనుకోని ఘటన ఎదురైంది. దీంతో ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. సాధారణంగా ఏదైన కొత్త షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లకు సినీ తారలను పిలవడం కామన్. వారితో షాప్‌ను ఓపెన్ చేయించి ప్రకటనలు ఇస్తుంటారు. సినీ తారలతో షాప్‌ ఓపెనింగ్ చేస్తే ప్రజలు కూడా తరలివస్తారని షాపు యజమానుల భావిస్తుంటారు. అలాగే హైదరాబాద్‌లో ఓ షాప్ ఓపెనింగ్ కోసం ఏకంగా బాలీవుడ్‌ నటిని పిలిపించారు. ఆమె కూడా అందుకు అంగీకరించి హైదరాబాద్‌కు వచ్చింది. తీరా ఇక్కడకు వచ్చాక ఆమెకు ఊహించని అనుభవం ఎదురైంది. ఇంతకీ బాలీవుడ్ నటి ఎందుకు భయాందోళనకు గురైంది... షాప్ ఓపెనింగ్‌కు వచ్చిన నటిని ఏం చేయాలని చూశారో ఇప్పుడు చూద్దాం.


బాలీవుడ్‌కు చెందిన ఓ నటికి హైదరాబాద్‌కు చెందిన స్నేహితురాలు తమ షాప్ ఓపెనింగ్ చేయాలని కోరింది. అందుకు పారితోషకం, ఛార్జీలు అన్నీ కూడా చెల్లిస్తామని తెలిపింది. దీనికి ఒప్పుకున్న సదరు నటి ఈనెల 18న హైదరాబాద్‌కు వచ్చింది. మాసబ్‌ట్యాంక్ శ్యామ్‌నగర్‌ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బస చేసింది. ఈ క్రమంలో అదే రోజు రాత్రి ఆమె షాక్‌కు గురయ్యే ఘటన జరిగింది. ఆమె ఉన్న అపార్ట్‌మెంట్‌లోకి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు చొరబడి వ్యభిచారం చేయాలంటూ నటిపై ఒత్తిడి చేశారు. ఆమెపై అత్యాచారం చేసేందకు ప్రయత్నించారు కూడా. దీంతో ప్రతిఘటించిన నటి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Delhi High Court: ప్రాథమిక ఆధారాలున్నాయి.. లోతైన దర్యాప్తు జరపాల్సిందే


వెంటనే అలర్ట్‌ అయిన వారు.. నటిని గదిలో బంధించి దాదాపు రూ.50వేల నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో ఘటన స్థలానికి మాసబ్‌ట్యాంక్ పోలీసులు చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారైన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వారు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే బాధితురాలి వద్ద నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు పోలీసులు.


ఇవి కూడా చదవండి...

TDP vs YSRCP: వైసీపీకి టీడీపీ సరికొత్త సవాల్ టార్గెట్ అదేనా

Life Style: ఈ చిట్కాలతో భార్య, భర్తల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 24 , 2025 | 09:33 AM