Share News

Mallareddy Comments On Assembly: అసెంబ్లీ అంటే అదీ.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 25 , 2025 | 01:15 PM

Mallareddy Comments On Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సమావేశాలపై మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Mallareddy Comments On Assembly: అసెంబ్లీ అంటే అదీ.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Mallareddy Comments On Assembly

హైదరాబాద్, మార్చి 25: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Former Minister Malla Reddy) ఏది మాట్లాడినా సంచలనమే. ఏం చేసినా ఆసక్తికరమే. ఆయన మీడియా ముందుకు వచ్చారంటే చాలు ఏదో విషయంపై మాట్లాడుతూ నవ్వులు పూయిస్తుంటారు. ఇప్పుడు తాజాగా మల్లారెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో.. అప్పటి అసెంబ్లీ సమావేశాలు.. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల మధ్య వ్యత్యాసాలను చెప్పుకొచ్చారు. గతంలో అసెంబ్లీని ప్రజలు ఆసక్తిగా చూసేవారని అన్నారు. ఇప్పుడు మాత్రం బట్టలు విప్పుడు, కత్తులు దూసుడే అన్నట్లుగా సమావేశాల్లో కనిపిస్తోందంటూ కామెంట్స్ చేశారు. అంతే కాకుండా అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి, వివేక్ మధ్య జరిగిన సంభాషణ కూడా ఆసక్తికరంగా మారింది.


మల్లారెడ్డి కామెంట్స్ ఇవే..

పార్లమెంట్‌లో ఆనాడు మాజీ ప్రధాని వాజుపేయి లాంటి వారు మాట్లాడుతుంటే దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసేవారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకులు సభలో మాట్లాడుతుంటే ప్రజలు టీవీలకు అత్తుకుని పోయేవారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అసెంబ్లీలో కేసీఆర్ ఏం మాట్లాడతారని ఆసక్తి ఉండేదని చెప్పుకొచ్చారు. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీలో మాత్రం బట్టలు విప్పుడు, కత్తులు దూసుడే కనిపిస్తోందంటూ మాజీ మంత్రి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ కామెంట్స్ సంచలనంగా మారాయి.


మల్లారెడ్డి, వివేక్ మధ్య ఆసక్తికర సంభాషణ

ఇక.. అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈరోజు అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేక్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ‘వివేక్‌ను.. నమస్తే మంత్రి గారు’ అంటూ మల్లారెడ్డి పలకరించారు. ఇందుకు థాంక్స్ మల్లన్న అని పలకరించారు వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్యామిలీ, వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీదే హవా నడుస్తోందంటూ మల్లారెడ్డి కామెంట్స్ చేయగా.. బీఆర్ఎస్ హయంలో కేసీఆర్, మల్లారెడ్డిదే హవా నడిచిందని వివేక్ సమాధానం ఇచ్చారు. ‘మేము అధికారం కోల్పోయాం మాదేం లేదన్న’ అంటూ మల్లారెడ్డి అనడంతో ఇద్దరు నేతల మధ్య నవ్వులు పూశాయి.


ఇవి కూడా చదవండి...

YS Sharmila Petrol Tax Criticism: వాటి ధరలు ఎప్పుడు తగ్గిస్తారు.. కూటమి సర్కార్‌కు షర్మిల ప్రశ్న

Supreme Court Comments: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 01:50 PM