Home » Mallareddy
MLA Marri Rajasekhar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
హీరోయిన్ కసీ కపూర్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేయడమే కాకుండా అసెంబ్లీకి డుమ్మా కొట్టి మరీ వచ్చానంటూ మల్లారెడ్డి చెప్పడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా సినిమా ఈవెంట్లకు హాజరుకావడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Mallareddy Comments On Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సమావేశాలపై మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు.
BRS: మాజీ మంత్రి మల్లారెడ్డి పవర్ఫుల్ డైలాగులకు పెట్టింది పేరు. రాజకీయాలతో పాటు నిజ జీవితానికి సంబంధించి శక్తిమంతమైన డైలాగ్స్ చెబుతూ ఆకట్టుకోవడంలో ఆయన పెట్టింది పేరు.
మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తన వద్ద భూమిని కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని, డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని 87 ఏళ్ల బాధితుడు కళ్లెం నర్సింహారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణలోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పీజీ సీట్లు అక్రమంగా విక్రయించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఈడీకి ఫిర్యాదులందాయి. దాంతో గతేడాది జూన్‌లో ఈడీ రంగంలోకి దిగి మాజీ మంత్రి మల్లారెడ్డితోపాటు ఇతర ప్రదేశాల్లో సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో పలు హార్డ్ డిస్క్‌లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.
ఎప్పుడూ మాటలతో అదరగొట్టే మాజీ మంత్రి మల్లారెడ్డి, ఈసారి డ్యాన్స్‌తో ఉర్రూతలూగించారు. తన మనవరాలి సంగీత్ ఫంక్షన్లో తనదైన శైలిలో బ్రేక్ డ్యాన్స్ వేశారు. 75 ఏళ్ల వయసులో ఆయన వేసిన డ్యాన్స్ చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీజేపీ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. కాసేపు ఆయనతో ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి తిరుగుపయనమయ్యారు. మరి మల్లారెడ్డి బీజేపీ ఆఫీసుకు ఎందుకెళ్లారు? ఏం పని మీద వెళ్లారు?
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో మాజీమంత్రి మల్లారెడ్డి ప్రత్యక్షం అయ్యారు. విషయం ఏంటి అని ఆరా తీస్తే.. తన మనమరాలి పెళ్లి ఉందని, పత్రిక ఇచ్చేందుకు వచ్చానని మల్లారెడ్డి చెబుతున్నారు.
తాను త్వరలో టీడీపీలో చేరబోతున్నానని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. టీడీపీకి పూర్వ వైభవం కోసమే చంద్రబాబుతో భేటీ అయ్యానని చెప్పారు.