Hyderabad: కేటీఆర్‌కు భారీ షాక్ ఇచ్చిన బంజారాహిల్స్ పోలీసులు..
ABN , Publish Date - Jan 10 , 2025 | 07:06 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు బంజారాహిల్స్ పోలీసులు షాక్ ఇచ్చారు. అనుమతి లేకుండా ర్యాలీ చేశారంటూ అందిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)కు బంజారాహిల్స్ పోలీసులు (Banjara Hills Police) షాక్ ఇచ్చారు. అనుమతి లేకుండా ర్యాలీ చేశారంటూ అందిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై కేసు నమోదు (Case registered on KTR) అయ్యింది. నిన్న (గురువారం) ఫార్ములా-ఈ కార్ రేస్ (Formula-E car Race) కేసులో భాగంగా ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను విచారించిన సంగతి తెలిసిందే. అయితే విచారణ అనంతరం ఎటువంటి అనుమతి లేకుండా ఏసీబీ కార్యాలయం నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వరకూ కేటీఆర్ పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడమే కాకుండా ట్రాఫిక్ సమస్యలు సృష్టించారంటూ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది. కాగా, ఇప్పటికే ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు మెడకు చుట్టుకుని కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా మరో కేసు నమోదు అవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
TG Politics: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు షాక్ ఇచ్చిన బీజేపీ.. అందరి కంటే ముందే..
BLN Reddy: ఏసీబీ విచారణలో బీఎల్ఎన్ రెడ్డి కీలక విషయాలు వెల్లడి..