Hyderabad: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. హైకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు..
ABN , Publish Date - Jan 08 , 2025 | 05:17 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై ఇవాళ(బుధవారం) మధ్యాహ్నం 4 గంటలకు ధర్మాసనం విచారణ చేపట్టింది.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు తెలంగాణ హైకోర్టు (High Court)లో చుక్కెదురు అయ్యింది. ఫార్ములా-ఈ కార్ రేస్ (Formula-E car race) వ్యవహారంలో కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ (Lunch Motion Petition)పై ఇవాళ(బుధవారం) మధ్యాహ్నం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలూ విన్న న్యాయస్థానం సాయంత్రం 4 గంటలకు తీర్పు వెలువరించింది. ఏసీబీ నమోదు చేసిన కేసు విచారణలో తనతోపాటు న్యాయవాది ఉండాలంటూ కేటీఆర్ కోరడాన్ని కోర్టు ఆక్షేపించింది. కేటీఆర్‌తోపాటు లాయర్ ఉండేందుకు హైకోర్టు నిరాకరించింది. విచారణ సమయంలో కేటీఆర్‌తో లాయర్ కలిసి కూర్చునే అవకాశం లేదని తేల్చి చెప్పింది.
Telangana: కేటీఆర్‌పై మరో ఫిర్యాదు..
కాగా, సీసీ టీవీ పర్యవేక్షణ లేదా కేటీఆర్ కనిపించేంత దూరంలో న్యాయవాది ఉండేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నప్పుడు న్యాయవాది రాంచందర్‌రావు విజిబుల్ డిస్టెన్స్‌లో ఉండేందుకు అంగీకారం తెలిపింది. విచారణ సందర్భంగా విజిబుల్ డిస్టెన్స్ ఉందా? అని న్యాయస్థానం ఏఏజీ రజనీకాంత్ రెడ్డిని ప్రశ్నించగా.. ఉందని ఆయన న్యాయస్థానానికి తెలిపారు. అలాగే విచారణ సమయంలో కేటీఆర్‌ను విండో నుంచి చూసే అవకాశం కూడా ఉందని, న్యాయవాది ఉండేందుకు లైబ్రరీ రూమ్‌లో ఏర్పాట్లు చేసినట్లు కోర్టు దృష్టికి ఏఏజీ తెచ్చారు. దీంతో కేటీఆర్ పక్కన నేరుగా విచారణలో పాల్గొనేందుకు రాంచందర్ రావుకు అనుమతి నిరాకరించింది. రేపు (గురువారం) ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణపై అభ్యంతరాలు ఉంటే మళ్లీ కోర్టుకు రావొచ్చని తెలిపింది.
ఈ వార్త కూడా చదవండి:
King Fisher: మద్యం ప్రియులకు షాక్.. కింగ్ ఫిషర్ బీర్లు బంద్..
KTR: ఆ కేసు గురించి ఆందోళన వద్దు..