BTech Student: నాలుగో అంతస్థు నుంచి దూకేందుకు యత్నించిన విద్యార్థిని.. అంతలోనే
ABN , Publish Date - Jan 29 , 2025 | 04:55 PM
Hyderabad: నగరంలోని ఓ ప్రైవేట్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో చదువుతున్న ఓ విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్ చేసింది. వెంటనే తోటి విద్యార్థులు అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.
హైదరాబాద్, జనవరి 29: కొందరు విద్యార్థులు చాలా సున్నితమనస్కులై ఉంటారు. చిన్న చిన్న వాటికి కూడా భయపడిపోతుంటారు. పరీక్షల సమయంలో వీరి భయం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. పరీక్ష రాశాక కూడా పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని ఆందోళన చెందుతుంటారు. ఈ క్రమంలో ఫలితాల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఒకరకమైన ఒత్తిడికి కూడా గురవుతుంటారు కొందరు విద్యార్థులు. చివరకు పరీక్షలో ఫెయిల్ అవుతామో అనే భయంతో ముందుగానే కఠిన నిర్ణయాలు తీసేసుకుంటుంటారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని తీసుకున్న నిర్ణయం అక్కడ ఉన్నవారిని కాసేపు భయాందోళనకు గురయ్యేలా చేసింది. ఇంతకీ ఏం జరిగింది.. విద్యార్థిని ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం.
నగరంలోని పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు ఉమెన్స్ ఇంజనీరిగ్ కళాశాలలో విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్ తీవ్ర కలకలం రేపగింది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని కీర్తి కాలేజ్ భవనం పైనుంచి కిందకు దూకేందుకు యత్నించింది. క్యాంపస్ పరీక్షలో ఫెయిల్ అవుతానేమో అనే భయంతో కీర్తి నాలుగో ఫ్లోర్ కిటికీ నుంచి దూకబోయింది. వెంటనే అప్రమత్తమైన తోటి విద్యార్థులు.. కీర్తి కిందపడకుండా పట్టుకుని కాపాడారు. విద్యార్థిని సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా.. షెడ్యూల్ ఇదే..
బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కీర్తి ఈ మధ్య కాలంలో సెమిస్టర్ ఎగ్జామ్ రాసింది. అయితే ఎగ్జామ్స్ సరిగ్గా రాయకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది కీర్తి. ఫెయిల్ అవుతానేమో అనే భయంతో క్లాస్ రూంలో నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చి నాలుగో అంతస్తులో నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించింది. అప్పటికే గమనించిన తోటి విద్యార్థులు.. వెంటనే అప్రమత్తమయ్యారు. విద్యార్థిని కిందకు దూకకుండా పట్టుకున్నారు. అతికష్టం మీద ఆమెను కిందకు దూకకుండా పట్టుకుని రక్షించారు. విద్యార్థిని సూసైడ్ అంటెప్ట్ చేస్తున్నట్లు గుర్తించిన మిగిలిన విద్యార్థులు అలర్ట్‌గా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ప్రస్తుతం విద్యార్థిని క్షేమంగా ఉందని కాలేజీ యాజమాన్యం తెలిపింది.
ఇవి కూడా చదవండి...
High Court: ఉస్మానియా ఆస్పత్రిని తరలిస్తే తప్పేంటి..
జగన్ హయాంలో పాఠశాలల బాగు ఉత్తుత్తే..
Read Latest Telangana News And Telugu News