Share News

TG News: షాకింగ్ న్యూస్.. పది అడుగుల లోతులో పడ్డ భారీ ట్రక్

ABN , Publish Date - Jan 10 , 2025 | 03:16 PM

Telangana: నగరంలో మరోసారి రోడ్డు కుంగుబాటుకు గురైంది. దాదాపు పది అడుగుల లోతులో భారీ ట్రక్కు దిగబడిపోయింది. అయితే ట్రక్కులో ఉన్న లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

TG News: షాకింగ్ న్యూస్.. పది అడుగుల లోతులో పడ్డ భారీ ట్రక్
Chaknawadi Nala

హైదరాబాద్, జనవరి 10: నగరంలోని ఓ ప్రాంతంలో పదే పదే రోడ్డు కుంగుబాటుకు గురవుతోంది. ఎన్ని సార్లు రోడ్డు వేసినప్పటికీ అదే ప్రాంతంలో వరుసగా రోడ్డు కుంగుబాటుకు గురవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆ ప్రాంతంలో నడిచి వెళ్లాలంటేనే ప్రజలు వణికిపోయే పరిస్థితి.. ఎక్కడ రోడ్డు కుంగుబాటుకు గురవుతుందో.. ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని స్థానికులు భయపడిపోతున్నారు. తాజాగా ఈరోజు (శుక్రవారం) కూడా భారీ శబ్ధంతో రోడ్డు కుంగిపోయింది. దీంతో ప్రజలు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇంతకీ ఆ రోడ్డు ఎక్కడ.. అక్కడ పరిస్థితి ఏంటి.. తాజాగా జరిగిన ఘటన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నగరంలోని గోషామహల్‌‌లో (Goshamahal) మరోసారి చాక్నావాడికి నాలా కుంగుబాటుకు గురైంది. దారుసలామ్ రోడ్డు నుంచి చాక్నావాడికి వెళ్లే రోడ్డులో ప్లైవుడ్ దుకాణాల ముందు నాలా కుంగింది. గతంలో కుంగిన నాలా పనులు కొనసాగుతుండగా ప్రక్కనే ఉన్న మరో నాలా కుంగుబాటుకు గురైంది.


ఈ సమయంలో నాలాపై ఉన్న క్రషర్ లారీ అందులో పడిపోయింది. దాదాపు పది అడుగుల లోతులో భారీ ట్రక్కు దిగబడిపోయింది. అయితే ట్రక్కులో ఉన్న లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటికే చాక్నావాడికి నాలా కుంగుబాటుకు గురవడం ఇది మూడో సారిగా చెప్పుకోవచ్చు. అయితే ప్రతీసారి ఇలా నాలా కుంగుబాటుకు గురవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అతిపురాతనమైన నాలా కావడంతో కుంగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. నాలా మొత్తాన్ని పునరుద్దరించాలని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇలా వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. అంతే కాకుండా ప్రతీ సారి నాలా కుంగడంతో ఆ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. కానీ ఇలా జరిగి ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని అక్కడి స్థానికులు ప్రశ్నిస్తు్న్నారు. తక్షణమే అధికారులు స్పందించి నాలా పునరుద్దరణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

బ్రాండ్‌ ఏపీ ముందుకెళ్తోంది


కాగా గత ఏడాది అక్టోబర్‌లో చాక్నివాడికి వెళ్లే మార్గంలో భారీగా రోడ్డు కుంగింది. ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అంతుకు ముందు 2022లో కూడా ఇదే ప్రాంతంలో నాలా కుంగింది. భారీ శబ్ధంతో నాలా కుంగడంతో భూకంపం వచ్చిందేమో అని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో పదుల సంఖ్యలో వాహనాలు అందులో పడిపోయాయి. అలాగే సంత జరుగుతుండటంతో కూరగాయల బండ్లు కూడా గుంతలో పడిపోయాయి.


ఇవి కూడా చదవండి...

Formula E Case: ఏసీబీ విచారణకు బీఎల్‌ఎన్ రెడ్డి

Game Changer: అసెంబ్లీలో చెప్పింది ఒట్టిదేనా.. సీఎంపై హరీష్ రావు ఫైర్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 10 , 2025 | 03:18 PM