Home » Goshamahal
Telangana: హైదరాబాద్‌లో రోడ్లు అకస్మాత్తుగా కుంగిపోతున్నాయి. భూకంపం వచ్చిందా అన్న తీరుగా రోడ్డు కుంగిపోతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
తన నివాసం వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై గోషా మహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆదివారం హైదరాబాద్‌లో స్పందించారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని నగర పోలీస్ ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. అయినా ఇటువంటి వాటికి తాను భయపడనని రాజా సింగ్ స్పష్టం చేశారు.
మూసీనదికి పూర్వ వైభవాన్ని కల్పించాలని కంకణబద్ధమైన రేవంత్ సర్కారు.. పక్కా ప్రణాళికతో ముం దుకు సాగుతోంది. ‘ఆపరేషన్ మూసీ’కి సన్నాహాలు చేస్తోంది.
రాష్ట్రంలో సెప్టెంబరు 17 నుంచి పది రోజులపాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఈసారి ప్రజాపాలన కార్యక్రమం చేపడతామని సీఎం చెప్పారు.
వాణిజ్య పన్నులశాఖలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కుంభకోణం కేసును సీఐడీ నుంచి సీబీఐకి బదలాయించేందుకు జోక్యం చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరారు.
గోషామహల్ చాక్నవాడి ప్రాంతంలో మరోసారి రోడ్డు కుంగిపోయింది. ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయి డీసీఎం వాహనం కిందపడిపోయింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తనను చంపుతామని కొందరు దుండగులు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal BJP MLA Rajasingh) తెలిపారు. ఇప్పటికే పలుమార్లు బెదిరింపు కాల్స్ రాగా.. పోలీసులకు ఫిర్యాదు చేశానని ‘ఎక్స్’లో వెల్లడించారు.
ప్రస్తుతం మన రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నదని, జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు వస్తున్నాయని, అభివృద్ధి జరుగుతోందని.. ఎవరైనా పొరపాటున బీజేపీకి ఓటేస్తే మతాల మధ్య చిచ్చుపెడతారని, పొద్దున లేస్తే మనుషుల మధ్య పంచాయితీలుంటాయని....
టెలీ కాలర్‌పై గోషా మహాల్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు రాజా సింగ్ మండిపడ్డారు. బైక్ కొనుగోలు కోసం లోన్ తీసుకున్నారు.. ఈ నేపథ్యంలో బ్యాంక్ లోన్ చెల్లించాలంటూ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు ఓ ప్రైవేట్ బ్యాంక్ తరఫున టెలీ కాలర్ ఫోన్ చేశారు.
ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Rajasingh)కు వచ్చిన బెదిరింపు కాల్స్ వ్యవహారంలో మంగళ్‌హాట్ పోలీసులు స్పందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.