CM Revanth Reddy: 14న విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Jan 02 , 2025 | 09:43 AM
హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. 14, 15 రెండు రోజుల పాటు సీఎం బృందం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. తర్వాత 20వ తేదీ నుంచి 24 వరకు దావోస్‌లో పర్యటిస్తారు.
హైదరాబాద్: తెలంగాణకు (Telangana) పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ఈ నెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు విదేశీ పర్యటనకు (Foreign Tour) వెళ్లనున్నారు. సీఎం మంగళవారం (14వ తేదీ) హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరుతారు. సింగపూర్, దావోస్‌లలో పర్యటించనున్నారు. 14, 15 రెండు రోజులపాటు సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ముఖ్యమంత్రితో పాటు ఆస్ట్రేలియాకు సీఎస్ శాంతి కుమారి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెళ్లనున్నారు. ఈ బృందం క్వీన్‌లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనుంది. జనవరి 16 న ఆస్ట్రేలియా నుంచి సింగపూర్‌కు వెళతారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం సింగపూర్‌లోని క్రీడా ప్రాంగణాలను పరిశీలించనుంది. జనవరి 20వ తేదీ నుంచి 24 వరకు దావోస్‌లో పర్యటిస్తారు. అంతర్జాతీయ ఆర్థిక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం హాజరవుతుంది.
దావోస్ వేదికగా ఈ నెల 20 నుంచి 24 వరకు 5 రోజుల పాటు ప్రపంచ ఆర్దిక వేదిక 55వ వార్షిక సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో జనవరి 21 నుంచి 23 వరకూ సీఎం రేవంత్‌తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజన్, ఇతర ఉన్నతాధికారులు ఆ సదస్సులో పాల్గొననున్నారు. 2024లో దావోస్ పర్యటన సందర్భంగా సుమారు రూ.40వేల కోట్లకుపైగానే పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు కంపెనీలతో చేసుకుంది. అవి కార్యరూపం దాల్చి వేర్వేరు దశల్లో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత దావోస్ పర్యటనలోనూ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం బృందం ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
దావోస్‌లో 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అంటే దాదాపు ఐదు రోజులపాటు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం జనవరి 21 నుంచి హాజరవుతోంది. 23 వరకు దావోస్‌లో పర్యటించనుంది. ఈ సదస్సుకు సీఎం రేవంత్‌తోపాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారులు హాజరవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రపంచ తెలుగు మహాసభల సమావేశాలకు సీఎం చంద్రబాబు
ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు..
అనంతపురంలో భారీ అగ్ని ప్రమాదం.. బస్సులు దగ్ధం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News