Share News

Dil Raju: నా ఉద్దేశం అదికాదు.. తప్పుగా అనుకోవద్దు

ABN , Publish Date - Jan 11 , 2025 | 03:45 PM

Dil Raju: ‘‘మన సంస్కృతిలో ఉండే దావత్ గురించి, మటన్, తెల్ల కల్లు గురించి మాట్లాడాను. ఆ మాటల్లో తెలంగాణ వాళ్లను అవమానించానని, అవహేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్లు చేసి, సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది. తెలంగాణ దావత్ నేను మిస్సవుతున్నాను. సంక్రాంతికి వస్తున్న ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక దావత్ చేసుకోవాలని ఉంది అని చెప్పటం నా ఉద్దేశం’’ అని దిల్ రాజు అన్నారు.

Dil Raju: నా ఉద్దేశం అదికాదు.. తప్పుగా అనుకోవద్దు
FDC Chariman Dilraju

హైదరాబాద్, జనవరి 11: హీరో వెంకటేష్ (Hero Venkatesh) నటించిన ‘‘సంక్రాంతికి వస్తున్నాం’’ సినిమా (Sankrantiki Vastunnam movie) ఈవెంట్‌లో భాగంగా ప్రముఖ నిర్మాత, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు (FDC Chairman Dil Raju) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ‘‘సంక్రాంతి పండుగకు (Sankranti Festival) ఆంధ్రాలా తెలంగాణలో వైబ్ ఉండదు. తెల్ల కల్లు, మటన్ మాంసం మీద వైబ్స్ ఉంటాయి’’ అంటూ బడా నిర్మాత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో దిల్ రాజు తెలంగాణ వాళ్లను అవమానించేలా మాట్లాడారంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలపై దిల్‌రాజు స్పందిస్తూ.. శనివారం వీడియోను విడుదల చేశారు. ‘‘నిజామాబాద్ పట్టణంలో ‘‘సంక్రాంతికి వస్తున్నాం’’ సినిమా ఈవెంట్ చేశాం. మన దగ్గర సినిమా ఈవెంట్స్ పెద్దగా జరగవు. అప్పట్లో ‘‘ఫిదా’’ సక్సెస్ మీట్ పెట్టాను. నిజామాబాద్ వాసిగా ఈ ప్రాంతంతో నాకున్న అనుబంధం అలాంటిది. మన సంస్కృతిలో ఉండే దావత్ గురించి, మటన్, తెల్ల కల్లు గురించి మాట్లాడాను. ఆ మాటల్లో తెలంగాణ వాళ్లను అవమానించానని, అవహేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్లు చేసి, సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది. తెలంగాణ దావత్ నేను మిస్సవుతున్నాను. సంక్రాంతికి వస్తున్న ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక దావత్ చేసుకోవాలని ఉంది అని చెప్పటం నా ఉద్దేశం. అదే విషయాన్ని ఈవెంట్ చివరిలోనూ చెప్పా. మన సంస్కృతిని నేను అభిమానిస్తా. అది అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారని తెలిసింది. నిజంగా మీరందరూ ఆ మాట వల్ల మనస్తాపం చెందితే క్షమించండి. నిజంగా నా ఉద్దేశం అది కాదు’’ అని స్పష్టం చేశారు.


ఆ సినిమాను గుండెలకు హత్తుకున్నారు..

నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ‘‘ఫిదా’’ సినిమాను తీశానని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమాకు ఎంతో ఆదరణ వచ్చిందన్నారు. కుటుంబ బంధానికి ఎంత విలువ ఇస్తామో అందులోని భానుమతి పాత్ర ద్వారా చెప్పామని.. ఆ మూవీ పెద్ద హిట్ అయ్యిందని తెలిపారు. అలాగే ‘‘బలగం’’ సినిమా తీసినప్పుడు తెలంగాణ సమాజం తమను అభినందించిందన్నారు. ‘‘ఇది మా సినిమా’’ అని ఇక్కడి ప్రజలు గుండెలకు హత్తుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమపై ప్రశంసలు కురిపించాయన్నారు. తెలంగాణ వాసిగా ఈ రాష్ట్ర సంస్కృతిని హేళన చేస్తానని ఎలా అనుకున్నారో తెలియదన్నారు.

TG News: వారి సరదా ఎంతటి ఘోరానికి దారి తీసింది..


ఆ విధంగా పనిచేస్తా...

‘‘నా మాటలు తప్పుగా అర్థం చేసుకుని ఉంటే క్షమించండి. మనోభావాలు దెబ్బతిన్నాయని అనుకుంటున్న వారికి నా క్షమాపణలు.. సినిమా రంగంలో కిందిస్థాయి నుంచి ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఎదిగాను. ఇటు సినిమా ఇండస్ట్రీ, అటు ప్రభుత్వానికీ మధ్యలో ఉంటూ పరిశ్రమకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నా. తెలంగాణలో తెలుగు సినిమా అభివృద్ధి చెందడంతో పాటు, యువతకు ఉపయోగపడేలా పనిచేస్తా. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సూచనలు చేశారు. ఆ ప్రభుత్వంతో కూడా కలిసి పరిశ్రమ అభివృద్ధికి, తెలుగు సినిమాకు సహకారమందిస్తా. ఎఫ్‌డీసీకి రాజకీయాలతో సంబంధం లేదు. ఇలాంటి అనవసర విషయాల్లోకి నన్ను లాగొద్దని తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా‌’’ అంటూ దిల్‌రాజు వీడియోలో చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి...

TG News: గేదెలు కాసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్

CM Revanth: సీఎం రేవంత్ జిల్లాల బాట.. వాటిపై ప్రత్యేక దృష్టి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 11 , 2025 | 04:41 PM