Fire Accident: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మరో అగ్ని ప్రమాదం..
ABN , Publish Date - Jan 03 , 2025 | 04:37 PM
Fire Accident: హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో రిషిక కెమికల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతోన్నాయి. అగ్నిమాపక వాహనాలు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
మేడ్చల్, జనవరి 03: హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో దూలపల్లిలోని రిషిక కెమికల్స్ గోడౌన్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగిసి పడుతోన్నాయి. దాంతో గోడౌన్ సిబ్బందితోపాటు స్థానికులు.. పోలీసులకి, అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో మూడు అగ్నిమాపక వాహనాలు ఘటన స్థలానికి చేరుకోని మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎగిసిపడుతోన్న మంటలతో.. సమీప ప్రాంతాలకు భారీగా పొగ వ్యాపించింది. ఆ క్రమంలో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతోన్నారు.
రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందనే అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అందులోభాగంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తొలుత నిర్ధారణకు వచ్చారు. కెమికల్స్ గోడౌన్‌లో భారీగా మంటలు, పొగలు వ్యాపించడంతో.. సమీప ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు.
ఈ సంస్థ గోడౌన్‌లో భారీ ఎత్తున కెమికల్స్ నిల్వ ఉంచినట్లు సమాచారం.ఈ అగ్ని ప్రమాదంలో భారీ స్థాయిలోనే నష్టం జరిగి ఉండ వచ్చననే సందేహాలు వ్యక్తమవుతోన్నాయి. భారీగా మంటలు ఎగసి పడుతుండడంతో.. గంటా, గంటన్నరలో అవి అదుపులోకి వస్తాయని అగ్నిమాపక సిబ్బంది ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇక రిషిక గోడౌన్ సిబ్బందితోపాటు స్థానికులను అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి కొంత దూరం పోలీసులు పంపించారు. మరోవైపు దట్టమైన పొగలు వ్యాపించడంతో.. స్థానికంగా ఓ విధమైన భయాందోళనలు నెలకొన్నాయి.
Also Read: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్
మరోవైపు జీడిమెట్ల పారిశ్రామిక వాడలో తరచూ అగ్నిప్రమాాదాలు చోటు చేసుకోవడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సైతం ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఆ ప్రమాద సమయంలో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు అగ్నిమాపక సిబ్బందికి కొన్ని గంటల సమయం పట్టిందని తెలిపారు. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్జప్తి చేశారు.
Also Read: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుందా?
పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడం.. నష్ట పరిహారాలు చెల్లించడం కాకుండా.. నివారణోపాయాలు కనుగోనాలంటూ ప్రభుత్వానికి స్థానికులు ఈ సందర్భంగా సూచించారు. అదీకాక వేసవి కాలం రానుందని.. దీంతో ఈ పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకోకుండా పరిశ్రమ యాజమాన్యానికి ముందస్తు చర్యల్లో భాగంగా స్పష్టమైన అవగాహన కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
For Telangana News And Telugu News