Share News

Hyderabad: వామ్మో.. ఇలాంటి ఆహారాన్ని మనం లొట్టలేసుకుని తింటున్నామా..

ABN , Publish Date - Jan 01 , 2025 | 01:32 PM

హైదరాబాద్: న్యూ ఇయర్ రోజు సైతం జీహెచ్ఎంసీ ఆహార భద్రతా అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు చేపట్టారు. కొంపల్లి, సుచిత్రలోని పలు రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. ఉలవచారు, మల్నాడు కిచెన్, ట్రైన్ థీమ్ రెస్టారెంట్‌ల్లో కల్తీ ఆహారాన్ని గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు షాక్ అయ్యారు.

Hyderabad: వామ్మో.. ఇలాంటి ఆహారాన్ని మనం లొట్టలేసుకుని తింటున్నామా..
Food safety officials inspection

హైదరాబాద్: న్యూ ఇయర్ రోజు సైతం జీహెచ్ఎంసీ ఆహార భద్రతా అధికారులు (Food Safety Officials) హోటళ్లు, రెస్టారెంట్ల (Hotels and Restaurants)పై దాడులు చేపట్టారు. కొంపల్లి (Kompalli), సుచిత్ర (Suchitra)లోని పలు రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. ఉలవచారు, మల్నాడు కిచెన్, ట్రైన్ థీమ్ రెస్టారెంట్‌ల్లో కల్తీ ఆహారాన్ని గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు షాక్ అయ్యారు. నాన్ వెజ్ ఐటమ్స్‌లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపినట్టు గుర్తించారు. కిచెన్ పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉండడంపై యాజమాన్యాన్ని ప్రశ్నించారు.


కిచెన్‌లో బొద్దింకలు ఉండడాన్ని ఫుట్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అలాగే కుళ్లిపోయిన కూరగాయలు, కాలం చెల్లిన మసాలాలు వాడుతున్నట్లు తనిఖీల్లో తేల్చారు. తుప్పుపట్టిన ఫ్రిడ్జిలో వెజ్, నాన్ వెజ్ ఆహార పదార్థాలు ఒకే చోట నిల్వ చేస్తున్నారని, చికెన్‌పై బటర్ అప్లై చేయడానికి రెస్టారెంట్లు పెయింటింగ్ బ్రష్ వాడుతున్నట్లు నిర్ధరించారు. హోటళ్ల యాజమాన్యాలు కనీస ప్రమాణాలు పాటించడం లేదని ఆహార భద్రతా అధికారులు తేల్చారు.


ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంపీ ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లే లక్ష్యంగా వరస దాడులు చేస్తున్నారు. తనిఖీల్లో హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు వాటిని నడిపిస్తున్న తీరు చూసి అవాక్కవుతున్నారు. అపరిశుభ్ర వంటగదులు, కుళ్లిన మాంసం, పాడైపోయిన కూరగాయలు, కాలం చెల్లి మసాలాలు, అనుమతులు లేకుండా బిజినెస్ చేయడం వంటి అనేక అంశాలను వెలుగులోకి తెస్తున్నారు. ప్రజల ప్రాణాలను హరించాలని చూసే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటున్నారు. అయితే అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా మిగతా వారిలో ఏమాత్రం భయం కనిపించడం లేదు. కనీస ప్రమాణాలు పాటించకుండా ప్రజల ఆరోగ్యాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి హోటళ్లపై మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలనే నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

TG News: రాచకొండ కమిషనరేట్‌‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎన్నో తెలుసా

Secunderabad: కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో 4.9 కిలోల గంజాయి పట్టివేత

న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 01 , 2025 | 02:51 PM