Share News

KTR: కాళేశ్వరంపై ఇప్పటికైనా చంపలేసుకోండి... సర్కార్‌పై కేటీఆర్ విసుర్లు

ABN , Publish Date - Jan 04 , 2025 | 09:29 AM

Telangana: కాళేశ్వరంపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై మరోసారి విరుచుకుపడ్డారు కేటీఆర్. కాళేశ్వరంపై ఎంత విషం చిమ్మినా తెలంగాణ ప్రజల దాహార్తి తీరుస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని ప్రచారం చేస్తున్నారని.. అయినప్పటికీ కాళేశ్వరం తెలంగాణను సస్యశ్యామలం చేసిందన్నారు. కాళేశ్వరంలో భారీగా కుంభకోణం జరిగిందనేది అబద్దపు ప్రచారమే..

KTR: కాళేశ్వరంపై ఇప్పటికైనా చంపలేసుకోండి... సర్కార్‌పై కేటీఆర్ విసుర్లు
Former minister KTR

హైదరాబాద్, జనవరి 4: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (BRS Working President KTR) వరుస ట్వీట్‌లతో దూసుకెళ్తున్నారు. ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ (Cogress Govt) పాలన, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు రేవంత్ సర్కార్‌పై దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. తాజాగా కాళేశ్వరంపై ట్వీట్‌ చేశారు కేటీఆర్. కాళేశ్వరం అంతా అవినీతిమయం అని, భారీ కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై అధికారంలోకి రాకముందే అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది కాంగ్రెస్. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరంలో జరిగిన అవకతవకలను బయటపెడాతమని చెప్పిన రేవంత్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ ఓ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో కాలేశ్వరం కమిషన్ విచారణను కొనసాగిస్తోంది.


కాళేశ్వరం నిర్మాణంలో భాగస్వాములైన అప్పటి నీటిపారుదలశాఖ అధికారులు, ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు, మాజీ ఐఏఎస్‌లు, ప్రస్తుత ఐఏఎస్ అధికారులను విచారించింది. ఇంకా కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే కాళేశ్వరంపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై మరోసారి విరుచుకుపడ్డారు కేటీఆర్. కాళేశ్వరంపై ఎంత విషం చిమ్మినా తెలంగాణ ప్రజల దాహార్తి తీరుస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని ప్రచారం చేస్తున్నారని.. అయినప్పటికీ కాళేశ్వరం తెలంగాణను సస్యశ్యామలం చేసిందన్నారు. కాళేశ్వరంలో భారీగా కుంభకోణం జరిగిందనేది అబద్దపు ప్రచారమే అని ఎక్స్‌ వేదికగా కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

గేమ్ ఛేంజర్ ఈవెంట్.. ఆ రూట్‌లో వెళ్లే వారికి అలర్ట్..


కేటీఆర్ ట్వీట్ ఇదే..

‘‘ఎంత విషం చిమ్మినా.. తెలంగాణ దాహం తీరుస్తోంది మన కాళేశ్వరం! మల్లన్నసాగర్ వద్దని నిరాహారదీక్షలు మీరు చేసినా.. నేడు మహనగర దాహార్తి తీరుస్తున్న వరప్రదాయిని మల్లన్నసాగర్! కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని ప్రచారం చేసినా.. తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం! ఇప్పుడైనా చెంపలేసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పు! కాళేశ్వరం కూలిపోయిందని కాకమ్మ కథలు చెప్పావని! లక్ష కోట్ల నష్టం వాటిల్లిందని అబద్ధపు ప్రచారాలు చేశావని! అధికారం కోసం కాళేశ్వరాన్ని నిందించినా.. నేడు ప్రజల దాహార్తి తీర్చే ఏకైక అస్త్రం కాళేశ్వరం! ’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

నాలుగో రోజు పెరిగిన బంగారం, వెండి ధరలు..

అత్యవసర ల్యాండింగైన ఇండిగో విమానం.. విషయం ఇదే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 04 , 2025 | 09:32 AM