Share News

Inter Exams: తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు గుడ్‌‌న్యూస్.. ఆ గడువు పెంపు

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:42 AM

Inter Exams: తదితర కారణాల వల్ల సకాలంలో ఫీజు కట్టని విద్యార్థులకు ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అందుకు చెల్లించే రుసుమును కూడా ప్రకటించింది.

Inter Exams: తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు గుడ్‌‌న్యూస్.. ఆ గడువు పెంపు
Telangana Inter Exams

హైదరాబాద్, జనవరి 7: తెలంగాణలో (Telangana State) ఇంటర్మీడియట్ (2024-2025 విద్యా సంవత్సరం) పరీక్షలు త్వరలో జరగబోతున్నాయి. ఇప్పటికే ఇంటర్ వార్షిక పరీక్షల (Inter Exams Schedule)షెడ్యూల్‌ కూడా వచ్చేసింది. దీంతో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. అలాగే ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఫీజు చెల్లించేందుకు ఇప్పటికే ఓ గడువు విధించి ఇంటర్ బోర్డు. గత ఏడాది డిసెంబర్ 31 వరకు ఫీజు చెల్లించేందుకు గడువు విధించింది. బోర్డు ఇచ్చిన గడువు తేదీ ఇప్పటికే ముగిసిపోయింది. అయితే తదితర కారణాల వల్ల సకాలంలో ఫీజు కట్టని విద్యార్థులకు ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అందుకు చెల్లించే రుసుమును కూడా ప్రకటించింది. గత డిసెంబర్ 31 వరకు ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ఇస్తూ గతంలో ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే గడువు ముగియడంతో మరోసారి ఫీజు చెల్లించే గడువు తేదీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఇంటర్ బోర్డు. జనవరి 16 వరకు రూ.2500 అపరాధ రుసుమును చెల్లించి పరీక్ష రాయాల్సిందిగా ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని బోర్డు అధికారులు తెలిపారు.


కాగా.. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు మొదలుకానున్నాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 5న నుంచి మార్చి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి. అంటే మార్చి 5న ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ప్రారంభంకానుండగా.. మార్చి 6న ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష మొదలుకానుంది.

జోక్యం చేసుకోం.. కేటీఆర్‌కు షాకిచ్చిన హైకోర్టు



ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇదే..

ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ పరీక్షల తేదీలు..

మార్చి 5న - ( పార్ట్-2 సెకండ్‌ ల్యాంగ్వేజ్‌)

మార్చి 7న - (పార్ట్-1 ఇంగ్లీష్ పేపర్)

మార్చి 11న - మాథ్స్ పేపర్ 1A, బోటని పపెర్-1 , పొలిటికల్ సైన్స్ పేపర్-1

మార్చి 13న (మ్యాథ్స్ పేపర్ 1B , జూలాజి పేపర్ -1, హిస్టరీ పేపర్-1)

మార్చి 17న - ఫిజిక్స్ , ఎకనామిక్స్

మార్చి 19న - కెమిస్ట్రీ , కామర్స్

వైరస్ భయాలు.. ఆరంభ లాభాలు ఆవిరి..


ఇంటర్‌ సెకెండ్ ఇయర్ పరీక్షల తేదీలు..

మార్చి 6 న - (పార్ట్-2 సెకండ్‌ ల్యాంగ్వేజ్‌)

మార్చి 10న - ( పార్ట్-1 ఇంగ్లీష్)

మార్చి 12న - మాథ్స్ పేపర్ 2A, బోటని , పొలిటికల్ సైన్స్

మార్చి 15న- మ్యాథ్స్ పేపర్ 2B , జూలాజి, హిస్టరీ

మార్చి 18న - ఫిజిక్స్ , ఎకనామిక్స్

మార్చి 20న - కెమిస్ట్రీ , కామర్స్


ఇవి కూడా చదవండి...

Allu Arjun: ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను చూడగానే అల్లు అర్జున్‌ రియాక్షన్ ఇదే..

KTR: కాంగ్రెస్ అంటేనే కన్నింగ్.. కేటీఆర్ విసుర్లు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 07 , 2025 | 12:10 PM