Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం
ABN , Publish Date - Jan 24 , 2025 | 12:25 PM
Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటి వరకు ఐఏఎస్‌ల విచారణను పూర్తి చేసిన కమిషన్ నిన్నటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజ్‌లను నిర్మించిన నిర్మణ సంస్థల ప్రతినిధులను కమిషన్ విచారిస్తోంది. నిన్న (గురువారం) సుందిళ్ల బ్యారేజ్ నిర్మించిన నవయుగ ప్రతినిధులను విచారించిన కమిషన్, ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్‌ను నిర్మించిన ఎల్ అండ్ టీ ప్రతినిధులను ప్రశ్నించనుంది.

హైదరాబాద్, జనవరి 24: కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణ కొనసాగుతోంది. నిన్నటి నుంచి నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ ప్రశ్నిస్తోంది. అందులో భాగంగా ఈరోజు (శుక్రవారం) ఎల్‌అండ్ టీ ప్రతినిధులు (L and T Representatives ) విచారణకు హాజరయ్యారు. ఈరోజు ఉదయం కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ బీఆర్‌కే భవన్‌కు చేరుకున్నారు. అనంతరం విచారణ మొదలైంది. విచారణకు హాజరైన మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ప్రతినిధులను కమిషన్ ప్రశ్నిస్తోంది. గతంలో సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా వారిని కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది.
కాగా.. కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటి వరకు ఐఏఎస్‌ల విచారణను పూర్తి చేసిన కమిషన్ నిన్నటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజ్‌లను నిర్మించిన నిర్మణ సంస్థల ప్రతినిధులను కమిషన్ విచారిస్తోంది. నిన్న (గురువారం) సుందిళ్ల బ్యారేజ్ నిర్మించిన నవయుగ ప్రతినిధులను విచారించిన కమిషన్, ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్‌ను నిర్మించిన ఎల్ అండ్ టీ ప్రతినిధులను ప్రశ్నించనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు నిర్మాణానికి సంబంధం ఉన్న అందరికీ నోటీసులు ఇచ్చిన కమిషన్.. వారి వద్ద నుంచి అఫిడవిట్ రూపంలో వివరాలను సేకరించింది కమిషన్. ఆ అఫిడవిట్‌లను ముందుకు పెట్టుకుని మరీ కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తోంది. అందులో భాగంగా సుందిళ్ల బ్యారేజ్ నిర్మించిన కాంట్రాక్టర్లను క్రాస్ ఎగ్జామిన్ చేసిన కమిషన్.. ఈరోజు ఎల్‌అండ్‌టీ ప్రతినిధులను క్రాస్ ఎగ్జామిన్ చేస్తోంది.
మీర్‌పేట్ హత్య కేసు.. కీలక ఆధారాలు లభ్యం..
ఈరోజు జరుగుతున్న విచారణ అత్యంత కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైనది బ్యారేజ్ మేడిగడ్డ. ఈ బ్యారేజ్‌ను 2016లో నిర్మాణం ప్రారంభిస్తే 2019లో నిర్మాణం పూర్తి అయ్యింది. 1.6 కిలోమీటర్ల పొడవున 87 పిల్లర్లు ఏర్పాటు చేసి బ్యారేజ్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులోని 6,7, 8 పిల్లర్లు కుంగిపోయాయి. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ బ్యారేజ్‌లో ఈ మూడు పిల్లర్లు కుంగిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రధానంగా ఆ విషయంపై కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేయడం.. విచారణ ప్రారంభంకావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ పిల్లర్ల కుంగుబాటు, నిర్మాణం, నాణ్యతలపై కమిషన్ కూలంకశంగా విచారణ జరిపే అవకాశం ఉంది. పిల్లర్ల కుంగుబాటుపై ఎల్‌అండ్‌టీ ప్రతినిధుల నుంచి పూర్తి వివరాలను కమిషన్ రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
CM Revanth Reddy: దావోస్ టూర్ సక్సెస్.. స్వరాష్ట్రానికి సీఎం రేవంత్
Lands Auction: కేపీహెచ్‌బీ భూముల వేలం.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హౌజ్ అరెస్ట్
Read Latest Telangana News And Telugu News