Maganti Gopinath : ఎమ్మెల్యేకి తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక
ABN , Publish Date - Feb 20 , 2025 | 05:37 PM
Maganti Gopinath : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. గత కొంత కాలంగా మాగంటి గోపినాథ్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. గత నాలుగు క్రితం ఆ సమస్య మరింత తీవ్రం కావడంతో.. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆయన్ని నగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యాన్ని వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. గత కొంత కాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజుల క్రితం ఈ సమస్య మరింత పెరిగింది. దీంతో కుటుంబ సభ్యులు.. ఆయన్ని ఆగమేగాల మీద ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకొంటున్నారు.
2023 ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ టీడీపీ టికెట్‌పై గెలుపొందారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన నాటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నాటి నుంచి ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతోన్నారు. 2019 ఎన్నికల్లో సైతం జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన విషయం విధితమే.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష.. హైకోర్టు కీలక తీర్పు
Also Read: రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆప్ ఎంపీ ప్రత్యక్షం
Also Read: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక మార్పులు..
For Telangana News And Telugu News