Share News

Wedding buzz.. మాఘమాసం వచ్చేసింది... శుభ ఘడియలు.. పెళ్లి సందడి..

ABN , Publish Date - Jan 30 , 2025 | 08:17 AM

మాఘమాసం వచ్చింది. దీంతో పెళ్లిళ్ల సందడి మొదలైంది. ఈ ఏడాది అధిక సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఈ నెల 31వ తేదీ నుంచి గృహప్రవేశాలకు మంచి ముహూర్తం ఉండగా.. ఫిబ్రవరి 2 వ తేదీ నుంచి మార్చి 26 వరకు పెళ్లిళ్లు జరుపుకునేందుకు శుభ ఘడియలున్నట్లు వేద పండితులు చెబుతున్నారు.

Wedding buzz.. మాఘమాసం వచ్చేసింది... శుభ ఘడియలు.. పెళ్లి సందడి..
Wedding Muhurthas ..

హైదరాబాద్: పెళ్లి పీటలెక్కి.. మూడు ముళ్లతో ఒక్కటయ్యేందుకు నిశ్చితార్థం జరిగిన జంటలు ఎదురుచూస్తున్న మాఘమాసం (Magha Masam ) వచ్చేసింది. గురువారం నుంచి మార్చి 16వ తేదీ వరకు పెళ్లిళ్లకు (Wedding ), నూతన గృహ ప్రవేశాలకు (New Home Arrivals) అన్నీ మంచి ముహూర్తాలే (Good times). ముఖ్యంగా నిశ్చితార్థం జరిగిన ఇళ్లలో పెళ్లి సందడి నెలకొంది. కల్యాణానికి ముహూర్తాలు నిర్ణయించుకొని ఫంక్షన్‌ హాళ్ల బుకింగ్‌, డెకరేషన్‌, కేటరింగ్‌ తదితర ఏర్పాట్లలో పెద్దలు మునిగిపోయారు. జనవరి 31న గృహప్రవేశాలకు మంచి ముహూర్తం ఉండగా.. ఫిబ్రవరి 2 వ తేదీ నుంచి మార్చి 26 వరకు పెళ్లిళ్లు జరుపుకునేందుకు శుభ ఘడియలున్నట్లు వేద పండితులు చెబుతున్నారు.

ఈ వార్త కూడా చదవంటి..

ఏపీలో పేద ప్రజలకు పండగ..


ముఖ్యంగా ఫిబ్రవరి 2, 3, 7, 13, 14, 15, 16, 21, 23, 25, మార్చి 2, 6, 7, 12, 14, 15, 16, 22 తేదీలు పెళ్లిళ్లకు ముహూర్తాలని వేద పండితులు తెలిపారు. ప్రత్యేకించి ఫిబ్రవరి 16, మార్చి 16 తేదీలు మంచి ముహూర్తాలని.. ఈ రెండ్రోజులు ఎక్కువ పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఏడాది జూలై వరకు కొన్ని ముహూర్తాలున్నాయని, నాలుగేళ్ల తర్వాత వరుస నెలల్లో శుభకార్యాలు జరుపుకునే అవకాశం ఈసారే వచ్చిందని వివరించారు. వేడుకల సమయం కావడంతో పురోహితులు, ఫంక్షన్‌ హాళ్లు, డెకరేషన్‌, కేటరింగ్‌, నిర్వాహకులు, పూల వ్యాపారులకు డిమాండ్‌ పెరగనుంది.


కాగా ఈ ఏడాది అధికసంఖ్యలో వివాహాలు జరుగనున్నాయి. వచ్చే రెండునెలల్లో చాలా వరకు వివాహాలకు కల్యాణ మండపాలు ముందస్తుగానే బుక్ చేసుకున్నారు. పురోహితులు, ఈవెంట్‌ ఆర్గనైజర్లు, క్యాటరింగ్, వస్త్ర వ్యాపారులు, బంగారం, వెండి వ్యాపారాలు, అలంకరణ, రవాణా వాహన యజమానులు, మేళతాళాల ట్రూప్‌లు, డీజేలు, టెంట్‌హౌస్‌లకు ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్‌ బాగా ఉంటుంది. మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాల్లో వివాహాది శుభకార్యాల ముహూర్తాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఫాల్గుణ మాసంలో (మార్చి 18వ తేదీ నుంచి 28 వరకు) శుక్ర మౌఢ్యమి రావడంతో ముహూర్తాలు ఉండవు. శ్రీరామనవమి తరువాత మళ్లీ పెళ్లిళ్ల సందడి మొదలవుతుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ

అమరావతిపై అదే ద్వేషం

చీకట్లో తొక్కిసలాట.. 40 మంది దుర్మరణం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 30 , 2025 | 08:17 AM