Share News

Indigo Flight: ఇండిగోలో ప్రయాణికుడి హల్‌చల్..అప్రమత్తమైన సిబ్బంది

ABN , Publish Date - Mar 25 , 2025 | 08:55 PM

Indigo Flight: సౌదీ నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికులు హల్‌చల్ చేశారు. దీంతో సహచర ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గరయ్యారు. విమానంలోని అత్యవసర తలుపును తీసేందుకు అతడు ప్రయత్నించారు. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో విమానం ల్యాండ్ కాగానే.. ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Indigo Flight: ఇండిగోలో ప్రయాణికుడి హల్‌చల్..అప్రమత్తమైన సిబ్బంది
Indigo Flight

హైదరాబాద్, మార్చి 25: సౌదీ అరేబియా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న ఇండిగో విమానంలో ప్రయాణికులు హల్‌చల్ చేశాడు. విమానం గాలిలో ఉండగా.. ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు అతడు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని సహాచర ప్రయాణికులు గమనించారు. అనంతరం విమాన సిబ్బందిని వారు అప్రమత్తం చేశారు. దీంతో సదరు ప్రయాణికుడిని విమాన సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఇంతలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఇండిగో విమానాన్ని పైలెట్ ల్యాండ్ చేశాడు. అనంతరం విమానంలో హల్‌చల్ చేసిన ప్రయాణికుడిని ఎయిర్ పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని ఎయి్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. అయితే సదరు ప్రయాణికుడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని సమాచారం. ఈ నేపథ్యంలో అతడికి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

Supreme Court: ఎమ్మెల్యేలు ఫిరాయింపులు..చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు

IPL Strategic Time-Out: ఐపీఎల్‌లో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ వెనుక ఇంత రహస్యం దాగి ఉందా

Supreme Court: ఎమ్మెల్యేలు ఫిరాయింపులు..చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు

Train Cancellation.. Reservation Ticket Refund: ప్రయాణించాల్సిన రైలు రద్దు అయింది.. టికెట్ రిఫండ్ పొందడం ఎలాగంటే..

Summer: వేసవిలో శరీరాన్ని కూల్ కూల్‌గా ఉంచాలంటే..

MPs Vs MLAs: ఎంపీల కంటే ఎమ్మెల్యేల జీతాలే టాప్..

For Telangana News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 08:56 PM