MahaKumbaMela: శంషాబాద్ ఎయిర్‍పోర్ట్ లో సెలబ్రటీస్ వెయిటింగ్
ABN , Publish Date - Feb 07 , 2025 | 03:33 PM
MahaKumbaMela: హైదరాబాద్‍లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మళ్లీ ప్రయాణికులు ఆందోళన బాట పట్టారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని ఎయిర్ పోర్ట్ అధికారులు కనీసం తమకు ముందుగా సమాచారం అందించలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 07: శంషాబాద్ ఎయిర్‍పోర్ట్ లో ప్రయాణికులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో శుక్రవారం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఉదయం 9.00 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఇంకా టేకాఫ్ కాలేదు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. రూ. 30 వేలు పెట్టి టికెట్ కొనుగోలు చేసినా.. ఇప్పటి వరకు విమానం టేకాఫ్ కాలేదంటూ వారు ఆందోళన చేస్తున్నారు. అయితే సదరు విమానంలో ప్రయాణించే ప్రయాణికుల జాబితాలో పలువురు సెలబ్రిటీలు, ఐఏఎస్, ఐపీఎస్ లతోపాటు సినీ ప్రముఖులు సైతం ఉన్నారు.
మరోవైపు శంషాబాద్ నుంచి బయలుదేరుతోన్న విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు ఎదురవుతోన్న సంగతి అందరికి తెలిసిందే. బుధవారం అంటే జనవరి 5వ తేదీన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఈ విమాన ప్రయాణం రద్దు అయింది. అందుకు ప్రతిగా ప్రత్యామ్నాయ విమానాన్ని అధికారులు ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు గంటలకుపైగా విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్నామని.. తమ ఇబ్బందులు అధికారులు పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు. అదీకాక విమానం రద్దు అయిన విషయం కూడా తమకు చివరి నిమిషంలో చెప్పారంటూ వారు విమానాశ్రయ అధికారులపై నిప్పులు చెరుగుతోన్నారు. విమానం రద్దు కావడంతో దేవుని దర్శనం సైతం చేసుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దేవ దేవుని దర్శనం కోసం ఎన్నో నెలల ముందు ఈ టికెట్లు కొనుగోలు చేశామని వారు వివరిస్తు్న్నారు.
అసలు అయితే ఈ విమానం షెడ్యూల్ ప్రకారం జనవరి 5వ తేదీ ఉదయం 5.30 గంటలకు అలియన్స్ ఎయిర్‌లైన్స్ 91877 విమానంలో 47 మంది ప్రయాణికులతో తిరుపతికి వెళ్లవలసి ఉంది. కానీ విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా దీనిని రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు విమానాశ్రయ అధికారులపై నిప్పులు చెరిగారు.
మరోవైపు ప్రయాగ్ రాజ్ వేదికగా మహా కుంభమేళ జరుగుతోంది. దేశవిదేశాల నుంచి భక్తులు ప్రయాగ్ రాజ్ వచ్చి.. పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఇవి ఫిబ్రవరి 14 వ తేదీతో ముగియనున్నాయి.
For Telangana News And Telugu news