Share News

Delhi: మోహన్ బాబు కేసు విచారణలో ట్విస్ట్.. ఆ రోజు విచారణ చేస్తామన్న సుప్రీంకోర్టు..

ABN , Publish Date - Jan 06 , 2025 | 03:36 PM

జర్నలిస్టుపై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‪ విచారణను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇవాళ(సోమవారం) మోహన్ బాబు బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం విచారణ చేపట్టింది.

Delhi: మోహన్ బాబు కేసు విచారణలో ట్విస్ట్.. ఆ రోజు విచారణ చేస్తామన్న సుప్రీంకోర్టు..
Mohan Babu

ఢిల్లీ: జర్నలిస్టుపై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబు (Mohan Babu) ముందస్తు బెయిల్ (Anticipatory Bail) పిటిషన్‪ విచారణను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) వాయిదా వేసింది. ఇవాళ(సోమవారం) మోహన్ బాబు బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అందుబాటులో లేకపోవడంతో మోహన్ బాబు తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని పాస్ ఓవర్ కోరారు. అయితే ఇందుకు న్యాయమూర్తులు అంగీకరించలేదు. దీంతో కేసు విచారణను గురువారానికి వాయిదా వేశారు. కొద్దిసేపటి తర్వాత సుప్రీంకోర్టు వద్దకు ముకుల్ రోహత్గీ చేరుకున్నారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ససేమిరా అన్న ధర్మాసనం.. గురువారానికి కేసు విచారణను వాయిదా వేసినట్లు తెలిపింది.


అసలేం జరిగిందంటే..?

కాగా, 2024 సంవత్సరాంతంలో మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. ఆస్తి పంపకాల్లో తేడాలు రావడంతో మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య వివాదం చెలరేగింది. ఈ వివాదంలో మోహన్ బాబు, విష్ణు ఒక సైడ్ ఉండగా.. మనోజ్ మాత్రం మరో సైడ్ అయిపోయారు. ఈ నేపథ్యంలో విష్ణు, మనోజ్ మధ్య తీవ్ర గొడవలు చోటు చేసుకున్నాయి. ఇద్దరూ పెద్దఎత్తున బౌన్సర్ల పెట్టి మరీ ఘర్షణకు దిగారు. అయితే డిసెంబర్ 10వ తేదీన హైదరాబాద్ జల్‌పల్లిలోని తన నివాసంలోకి మనోజ్‌ను రానీయకుండా మోహన్ బాబు ఆపేశారు. అదే ఇంట్లో తన కుమార్తె ఉండడంతో మనోజ్ పెద్దఎత్తున తన అనుచరులు, జర్నలిస్టులతో ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించారు. గేట్లు బద్దలు కొట్టి మరీ లోపలికి వెళ్లారు.


గేట్లు బద్దలు కొట్టుకుని మనోజ్ ప్రవేశించడంతో మోహన్ బాబు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇదే సమయంలో ఓ టీవీ ఛానల్‌కు చెందిన జర్నలిస్టు ఆయన్ను ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన మోహన్ బాబు.. రిపోర్టర్ వద్ద ఉన్న మైక్ లాక్కొని అతడిపైనే దాడి చేశారు. దీంతో జర్నలిస్టు తలకు తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు తనను అరెస్టు చేయకుండా ఆదేశించాలంటూ తెలంగాణ హైకోర్టును మోహన్ బాబు ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం అతని పిటిషన్‌ను కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును మోహన్ బాబు ఆశ్రయించారు. కాగా, ఇవాళ జరగాల్సిన విచారణను అత్యున్నత న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు.. పర్మిషన్ తీసుకోవాల్సిందే..

CM Revanth: మోదీ ముందు చిట్టా విప్పిన రేవంత్...

Updated Date - Jan 06 , 2025 | 03:56 PM